Begin typing your search above and press return to search.
రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ఇళ్ల కొనుగోలుకు పాకిస్తాన్ నిర్ణయం
By: Tupaki Desk | 29 Sept 2020 5:00 AM ISTస్వాతంత్య్రానికి ముందు భారత్-పాకిస్తాన్ కలిసే ఉండేవి. ముస్లిం నేతలు తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేయడంతో ఈ రెండు దేశాలు విడిపోయాయి. మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుట్టింది ఇప్పటి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోనే. ఇలా రెండు దేశాల మధ్య విడదీయని సంబంధాలు ఎన్నో ఉన్నాయి.
ప్రముఖ దిగ్గజ బాలీవుడ్ నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ల పూర్వీకులు గతంలో పాకిస్తాన్ లో ఉండేవారు. వారి ఆస్తులు పాస్తులు, వారి ప్రఖ్యాత భవనాలన్నీ ఇప్పటికీ పాకిస్తాన్ లో ఉన్నాయి. వారి ఇళ్లు చారిత్రక కట్టడాలుగా కోటలుగా చూడముచ్చటగా ఉన్నాయి.
అయితే శిథిలావస్థకు చేరిన హీరోలు రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ల పూర్వీుల ఇళ్లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్ లోని ఖైబర్ పంకుత్వా తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రక ప్రాధాన్యం గల వీటిని కూల్చివేయకుండా చూసేందుకు వీటిని నేషనల్ హెరిటేజ్ గా గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
రాజ్ కపూర్ ఇంటిని 1918-22 మధ్యకాలంలో నిర్మించారు. అలాగే దిలీప్ కుమార్ పూర్వీకుల వంద ఏళ్ల నాటి భవనం కూడా దీనికి సమీపంలోనే ఉంది.