Begin typing your search above and press return to search.

రైనా... ధోని నమ్మకం లేకేనా..?

By:  Tupaki Desk   |   17 Feb 2022 1:30 PM GMT
రైనా... ధోని నమ్మకం లేకేనా..?
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యధిక పరుగుల వీరుల్లో అతడొకడు.. బ్యాట్ తోనే కాదు..ఫీల్డింగ్ లో మెరిక. వన్ డౌన్ లో అతడు దిగాడంటే జట్టుకు భరోసా. జట్టు అత్యంత విజయవంతైమందంటే అందులో అతడి పాత్ర కూడా ఉంది. ఆ జట్టు చెన్పై సూపర్ కింగ్స్ కాగా..

ఆ ఆటగాడు సురేశ్ రైనా. కానీ, అలాంటి రైనాను ఈసారి సీఎస్కే రిటైన్ చేసుకోలేదు. సరికదా.. వేలంలోనూ కొనుగోలు చేయలేదు. అంతేకాక వేలంలో ఇంకే ఫ్రాంచైజీ కూడా కొనలేదు. చెన్నై వైస్ కెప్టెన్ గా, కొన్నిసార్లు కెప్టెన్ గానూ వ్యవహరించిన రైనా పరిస్థితి ఎందుకిలా మారింది..? తను అత్యంత ఆరాధించే చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా అతడిని కాపాడలేకపోయాడా? కనీసం ఒక్క మాట చెప్పయినా.. రైనాను ఈ ఒక్కసారి కొనుగోలు చేద్దామని చెప్పలేకపోయాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు. మరి వీటికి సమాధానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

అన్నకు తమ్ముడి కంటే ఎక్కువలా..

రైనా, ధోని అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉండేవారు. రైనాను కెరీర్ మొదటి నుంచి ప్రోత్సహించాడు ధోని. టీమిండియా కు అడేటప్పుడైనా, ఆ తర్వాత ఐపీఎల్ కు మారినా.. రైనా విజయంలో ధోని పాత్ర కచ్చితంగా ఉంది. అంతలా వీరిద్దరి మధ్య బంధం పెనవేసుకుంది. ధోని ఎప్పుడైతే టీమిండియా కెప్టెన్సీ వదులుకున్నాడో అప్పటినుంచే రైనా ప్రాభవం కూడా తగ్గడం మొదలైంది. అతడు కూడా అంతర్జాతీయ క్రికెట్ పై పెద్దగా ఆశల్లేనట్లే ఉండేవాడు. అందుకనే రంజీలు కూడా ఆడేవాడు కాదు. కేవలం ఐపీఎల్ కు మాత్రమే ఆడేవాడు. మరోవైపు ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినరోజు రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికి అతడికి 32 ఏళ్లే. మరికొన్నేళ్లు ఆడగలిగే సత్తా ఉండి కూడా రైనాను రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అదలా వదిలేస్తే రైనా మరికొద్ది

రోజులకే వచ్చిన 2021 ఐపీఎల్ లీగ్ కు అర్ధంతరంగా దూరం కావడం మరింత చర్చ రేపింది.
వ్యక్తిగత కారణాలా? పట్టుదలకు పోయాడా?

రైనా.. 2021 సీజన్ కు జట్టుతో దుబాయ్ వెళ్లాడు. కానీ, తనకు కేటాయించిన హోటల్ గది బాగోలేదంటూ అలిగినట్లు వార్తలు వచ్చాయి. కెప్టెన్ ధోనికి ఇచ్చిన గది లాంటిదే (బయటి వాతావరణం కనిపించేలా) తనకూ కావాలని పట్టుబట్టినట్లు తెలిసింది. అదంతా అవాస్తవం అనుకున్నా.. రైనా ఆ సీజన్ కు అర్థంతరంగా జట్టును వీడాడు. ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. రైనా లేని చెన్పై 2021 సీజన్లో ఎన్నడూ లేనంతగా దారుణ ప్రదర్శన చేసింది. దీంతోనే రైనా తీరుపై విమర్శలు వచ్చాయి. కానీ, అదే సమయంలో పంజాబ్ లోని తన సన్నిహిత కుటుంబ సభ్యుల ఇంట్లో దొంగలు పడి ఇద్దరిని చంపేయడం.. మరికొందరిని తీవ్రంగా గాయపర్చడంతో విషయం పక్కకు

జరిగింది. అయితే, మిగతా సమస్యలన్నీ తొలగి రైనా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సీజన్ కు అతడిని కొనుగోలు చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. దీనికి కారణాలేమిటలో న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సైమన్‌ డౌల్‌ చెప్పాడు. రైనా.. జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ విశ్వాసాన్ని కోల్పోయాడని చెప్పాడు. అతడిని ఎవరూ ఎంపిక చేసుకోకపోవడంపై స్పందించిన సైమన్‌ అందుకు పలు కారణాలున్నాయన్నాడు. ‘‘వేలంలో రైనాను ఎవరూ కొనుగోలు చేయకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూఏఈలో అతడు చెన్నై జట్టు విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆ విషయంలో అసలేం జరిగిందనేది మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. దాని

గురించి ఇప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది. రైనా జట్టుతో పాటు.. కెప్టెన్‌ ధోనీ నమ్మకాన్నీ కోల్పోయాడు. ఎవరి విషయంలోనైనా ఒక్కసారి అలా జరిగితే.. ఇక తిరిగి జట్టులోకి రావడం అసాధ్యం’ అని సైమన్‌ ఓ క్రీడా ఛానెల్‌తో చెప్పాడు. కాగా, సురేశ్‌ రైనా ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ నుంచీ చెన్నై జట్టులోనే ఉన్నాడు. 2016, 17 సీజన్లలో ఆ జట్టు నిషేధానికి గురైనప్పుడు మాత్రం గుజరాత్‌

లయన్స్ తరఫున ఆడాడు. అయితే, 2020లో వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమైన రైనా.. గతేడాది తిరిగి జట్టులో చేరి ఆడినా పెద్దగా స్కోర్లు సాధించలేకపోయాడు. మరోవైపు అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలకడంతో సరైన ఫిట్‌నెస్‌ లేడనే కారణంతో సీఎస్కే ఈ సారి వదిలేసిందని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ ఇటీవల వెల్లడించాడు.