Begin typing your search above and press return to search.

చౌక ధరకే జంట నగరాల ఫ్లడ్ వెహికిల్స్!

By:  Tupaki Desk   |   27 Sept 2016 3:22 PM IST
చౌక ధరకే జంట నగరాల ఫ్లడ్ వెహికిల్స్!
X
హైదరబాద్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా రాజకీయంగా - ఆర్ధికంగా ఎవరికి ఎంత నష్టం అనే అంచనాల సంగతి కాసేపు పక్కనపెడితే... సెకండ్ హ్యాడ్ కార్లు బిజినెస్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. ఈమధ్యకాలంలో ఎన్నడూ లెనంతగా కురిసిన భారీ వర్షాల దెబ్బకు జంటనగరాల్లోకి కార్లు మాత్రం షెడ్డులకు చేరుకున్నాయి. ఫలితంగా చౌక రేటుకే అమ్ముడైపోవడానికి రెడీగా ఉన్నాయి.

హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ వర్షాలకు దెబ్బ తిన్న కార్లు దాదాపు 8 వేల నుంచి 10 వేల వరకూ ఉంటాయని అంచనా. దీంతో ఇవన్నీ ఇప్పుడు గ్యారేజీలకు క్యూ కడుతున్నాయి. ఈ వర్షాలకు దెబ్బ తిన్న కొన్ని కార్లకైతే వీటి రిపేరుకు అయ్యే ఖర్చు.. కొత్త కారు కొనడానికి పెట్టే డబ్బుకు దాదాపుగా దగ్గరగా ఉంటుందట. దీంతో డ్యామేజీ అయిన కార్లు గ్యారేజీలకు - షో రూములకు వరుసగా వచ్చి చేరుతున్నాయి. వీటికి ప్రత్యేకమైన పేరు కూడా ఉంది.. అదే "ఫ్లడ్ వెహికిల్స్"!

కూకట్ పల్లి - నిజాంపేట్ వంటి చోట్ల సెల్లార్స్ లో పార్క్ చేసిన వాహనాల్లో నీరు చేరి - దాదాపు 70శాతం భాగం నీటిలో నాని - బాడీ అంతా గీతలు వాతలతో నిండిపోయింది. ఈ సమయంలో భారీ సొమ్ము వెచ్చించి మరమ్మతు చేయించే బదులు పాడైన కార్లను వచ్చిన రేటుకు అమ్ముకుని కొత్త వాహనం కొంటే బెటరేమో అని చాలామంది భావిస్తున్నారట. వీటి మరమ్మతులకే లక్ష నుంచి రెండు లక్షలవరకు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఈ ఫ్లడ్ వెహికల్స్ ఓనర్స్ చెబుతుండగా... తమ గ్యారేజీకి సాధారణంగా నెలకు ఐదో - ఆరో కార్లు వస్తాయని, కానీ ఈ సారి ఏకంగా 20 కార్ల వరకూ వచ్చాయని మెకానిక్స్ చెబుతున్నారట! మోడల్ ని బట్టి ఒక్కో కారును లక్ష రూపాయలనుంచి 5 లక్షలవరకు అమ్ముతున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/