Begin typing your search above and press return to search.

రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణన్ మార్క్.. హడలిపోతున్న ఉద్యోగులు..!

By:  Tupaki Desk   |   24 Nov 2022 12:30 PM GMT
రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణన్ మార్క్.. హడలిపోతున్న ఉద్యోగులు..!
X
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రైల్వేలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. 2021 నుంచి రైల్వే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తప్పవనే సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన.. అవినీతికి పాల్పడిన వారిపై కోరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటివరకు ఏకంగా 139 మందిపై అశ్విన్ వైష్ణవ్ వేటు వేయడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.

2021 జూలై నుంచి క్రమశిక్షణ రాహిత్యం పేరుతో 139 మందికి బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి పంపించారు. ప్రతీ మూడు రోజులకు ఒకరిపై వేటు పడినట్లు గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. అయితే గతంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రైల్వే మంత్రులు మోమో జారీ చేయడమో.. లేదంటే సస్పెండ్ చేయడమో చేసేవారు.

కానీ అశ్విన్ వైష్ణవ్ మాత్రం ఉద్యోగులను శాశ్వతంగా ఇంటికి పంపించి వేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే స్వచ్చంధ విరమణతో ఇంటికి పంపించి వేస్తుండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని శాశ్వతంగా ఇంటికి పంపించేస్తున్నారు. ఆయన హయాంలో ఇప్పటి వరకు 139 మందికి వీఆర్ఎస్ ఇవ్వగా మరో 38 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

తాజాగా మరో ఇద్దరు సీనియర్ గ్రేడ్ అధికారులపై రైల్వే శాఖ వేటు వేసింది. వీరిలో ఒకరు హైదరాబాద్లో ఐదు లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబట్టారు. మరొకరు మూడు లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి ఉద్యోగులపై వరుసగా క్రమశిక్షణ చర్యలకు చేపడుతున్నారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. డ్యూటీని లైట్ తీసుకున్న వారిని గుర్తించి వీఆర్ఎస్ ఇచ్చి పంపుతున్నారు. ఇక అవినీతికి పాల్పడే వారిపై తక్షణమే వేటు పడుతుంది. ఇప్పటికే వేటు పడిన ఉద్యోగుల్లో ఎలక్ట్రికల్.. సిగ్నలింగ్.. మెడికల్.. మెకానికల్.. స్టోర్స్ విభాగానికి చెందిన వారన్నరని తెలుస్తోంది. అశ్విన్ వైష్ణవ్ రైల్వే ఉద్యోగులపై క్రమశిక్షణ పేరుతో కోరడా ఝళిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.