Begin typing your search above and press return to search.

జూన్ 1 నుండి తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే..!

By:  Tupaki Desk   |   21 May 2020 8:15 AM GMT
జూన్ 1 నుండి తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే..!
X
మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తొందరలోనే ముగియనుంది. ఈ తరుణంలోనే ఒక్కొక్కటిగా ప్రజా రవాణాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభం కానుండగా.. ప్యాసింజర్ రైళ్లు జూన్ 1 నుంచి మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా జూన్ 1 నుండి నడిచే రైళ్ల జాబితాను రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రోజు ఉదయం నుంచి వీటి బుకింగ్ ప్రారంభం కానుండగా.. మొత్తం 200 రైళ్లకు సంబంధించి వివరాలు విడుదలయ్యాయి. వీటిని స్పెషల్ ట్రైన్స్‌గానే రైల్వేశాఖ నడపనుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబై CST- హైదరాబాద్( హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్)
హౌరా – సికింద్రాబాద్ (ఫలక్ నామా ఎక్స్ ప్రెస్)
న్యూఢిల్లీ – హైదరాబాద్ ( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
విశాఖ – న్యూఢిల్లీ( ఏపీ ఎక్స్ ప్రెస్)
గుంటూరు – సికింద్రాబాద్(గోల్కొండ ఎక్స్ ప్రెస్)
తిరుపతి – నిజామాబాద్( రాయలసీమ ఎక్స్ ప్రెస్)
హైదరాబాద్ – విశాఖ( గోదావరి)
సికింద్రాబాద్ – నిజాముద్దీన్(దురంతో).. వీటితో పాటు ఇంకొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తాయి.