Begin typing your search above and press return to search.

రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం ..ఇక పై టికెట్స్ అన్ని

By:  Tupaki Desk   |   14 Feb 2020 6:00 PM IST
రైల్వే శాఖ మరో కీలక  నిర్ణయం ..ఇక పై టికెట్స్ అన్ని
X
కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ప్రయివేటు రైళ్లను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దేశవ్యాప్తంగా తొలి దశలో సుమారు వందమార్గాల్లో 150 ప్రయివేటు రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు ఏడాదిలోపే అందుబాటులోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 మార్గాల్లో 17 ప్రయివేటు రైళ్లు ప్రారంభించనున్నారు. అయితే ఈ రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్లు ఆన్‌ లైన్‌ లో అమ్మబోతున్నారు. సాధారణంగా రైలు ప్రయాణం చేయాలంటే..ఆ స్టేషన్‌ కు వెళ్లి టికెట్‌ తీసుకుంటాం.. కానీ , రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా ప్రయివేటు రైళ్లకు టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేయడం లేదు.

ప్రస్తుతం సాంకేతికత పెరిగిపోవడంతో దాదాపుగా అందరూ ఐఆర్‌ సీటీసీ ఆన్‌ లైన్‌ బుకింగ్‌ ద్వారా కొందరు రైలు టికెట్లు, రిజర్వేషన్లను ఖరారు చేసుకుంటున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇక పూర్తిగా రైలు టికెట్లన్నీ ఆన్‌ లైన్‌ లోనే విక్రయించాలని రైల్వే శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్‌ లైన్‌ లో ప్రయివేటు రైళ్ల టికెట్‌ విక్రయాలు విజయవంతమైతే.. రైల్వేశాఖ పరిధిలోని అన్నీ రైళ్ల టికెట్‌ లు, రిజర్వేషన్‌లన్నీ ఆన్‌ లైన్‌ లో అమ్మకాలు జరిపేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఓ రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. అందుకే ఇప్పటినుంచే ఆన్‌ లైన్‌ లో రైలు టికెట్‌ కొనుగోలు అలవాటు చేసుకోవాల్సిందేనని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అంటే.. వచ్చే రోజుల్లో రైల్వేస్టేషన్‌ కు వెళ్లి టిక్కెట్‌ తీసుకోవడం .. రిజర్వేషన్‌ చేసుకోవడం.. అనేది ఇక ఉండకపోవచ్చు. ఫలితంగా రైల్వేస్టేషన్‌లలో 24 గంటలు అందుబాటులో ఉండే బుకింగ్‌ కౌంటర్లు అతి త్వరలో కనుమరుగై పోబోతున్నాయి అని తెలుస్తుంది. ప్రయివేట్ రైళ్ల టికెట్‌ కొనుగోలు కూడా విమానం టికెట్‌ మాదిరిగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రయివేటు రైళ్లలో బెర్త్‌ ఉంటేనే ఆన్‌లైన్‌లో టికెట్‌ లభిస్తుంది.

మాములుగా, ఐఆర్‌ సీటీసీలో అయితే బెర్త్‌ లేకపోయినా వెయిటింగ్‌ లిస్ట్‌లో టికెట్‌ లభిస్తుంది. కానీ ప్రైవేట్ రైలులో అలా కాదు. రైలులో బెర్త్‌ ఖాళీగా ఉంటేనే టికెట్‌ చూపిస్తుంది. అలాగే ఈ రైళ్లలో చివరి నిమిషంలో కనుక టిక్కెట్‌ రద్దు చేసుకుంటే కట్టిన డబ్బులో ఎక్కువ శాతం నష్టపోయే ప్రమాదముంది. ఇదే కాకుండా ఎన్ని రోజులు ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకుంటే అంత తక్కువ ధరకు టికెట్‌ దొరికే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఙానం ఉన్నవారు ఇప్పటికే రైల్వే టికెట్‌ల కొనుగోలు, రిజర్వేషన్‌ల కేటాయింపులు ఐఆర్‌ సీటీసీ ద్వారా కొనుగోలు చేస్తున్నారు.