Begin typing your search above and press return to search.
డ్రై బడ్జెట్... విత్ కస్టమర్ రెస్పెక్ట్ !
By: Tupaki Desk | 26 Feb 2016 4:07 AM GMT"ఇప్పటివరకు వచ్చిన రైలు బడ్జెట్లలో అత్యంత బలహీమనమైన బడ్జెట్ ఇది" అని ఇప్పటికే చాలా విమర్శలు మొదలయ్యాయి. ఇది చాలావరకు నిజమే. ఇది రాష్ట్రానికి సంతృప్తిని ఇవ్వని బడ్జెటే కానీ... ఈ బడ్జెట్లో కొన్ని చెప్పుకోదగ్గ అంశాలున్నాయి. అవి రైల్వే ఆదాయం పెంచే సేవలు కాదు, ప్రయాణికుడిని గౌరవించే సేవలు. సాధారణంగా ఇలాంటివి మోడీ మార్క్ గా భావించొచ్చు. తాత్కాలికంగా అవి గొప్పగా పరిగణించలేం గాని ఎవరూ కాదననివి, వద్దననివి.
* 3 కొత్త సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు : హమ్సఫర్ - తేజాస్ - ఉదయ్
* రిజర్వేషను రహిత సూపర్ ఫాస్ట్ అంత్యోదయ ఎక్స్ ప్రెస్ లు
* సామాన్యులను గౌరవిస్తూ వసతులతో కూడిన దీన్ దయాళ్ బోగీలు (సాధారణ భోగీలు)
* వృద్ధులకు లోయర్ బెర్తుల కేటాయింపు పెంపు
* వంద స్టేషన్లలో వైఫై
* ఇ టికెటింగ్ మరింత వేగంగా, సమర్థంగా పనిచేసే టెక్నాలజీ.
* పెద్ద రైల్వే స్టేషన్లన్నింటిలో భద్రత కోసం సీసీ టీవీలు.
* శుభ్రతను పెంచే ముప్పై వేల బయో టాయిలెట్లు
* ఫోన్ చేస్తే వచ్చి బోగీ శుభ్రం చేసే వెసులుబాటు
* విదేశీ పర్యాటకులకు, ఎన్నారైలకు సదుపాయంగా ఇంటర్నేషనల్ క్రెడిట్/డెబిట్ కార్డుల అనుమతి,
* దర్శనీయ స్థలాలలో ఉన్న రైల్వే స్టేషన్ల సుందరీకరణ.
* ట్రైన్ లో రేడియోలు
* వృద్ధులు, వికలాంగులకు సహాయకుల ఏర్పాటు.
* ట్రావెల్ ఇన్సూరెన్స్ టికెట్ తో పాటు (ఆప్షనల్)
* చిన్నారులకు ప్రత్యేక ఆహారం అందించే జనని సేవ పథకం.
* పాశ్చాత్య దేశాలను తలదన్నే స్మార్ట్ కోచ్ లు, బయో వాక్యూమ్ టాయిలెట్లు (దశల వారిగా)
* ప్రయాణికుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక యాప్
* రైల్వే ప్రయాణ సమాచారం తెలిపే జీపీఎస్ బోగీల్లో అందుబాటులోకి.
ఇవన్నీ ప్రయాణికుడిని కేవలం గమ్యం చేర్చే ఉద్దేశంతో కాకుండా ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా, ఆహ్లాదంగా మార్చే ఏర్పాట్లు. అభివృద్ధి చెందిన దేశాల లాగే ప్రయాణికులకు మరిన్ని హక్కులు కల్పించడం వీటి లక్ష్యం.