Begin typing your search above and press return to search.

సోనియా కోసం రాహుల్ విచారణను వాయిదా వేసిన ఈడీ

By:  Tupaki Desk   |   17 Jun 2022 8:30 AM GMT
సోనియా కోసం రాహుల్ విచారణను వాయిదా వేసిన ఈడీ
X
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఈడీ విచారించింది. ఇవాళ నాలుగోరోజు విచారణకు హాజరు కావాలని సమన్లు కూడా ఇచ్చింది.

కానీ తల్లి , కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోవిడ్ తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే విషయాన్ని ఈడీకి వివరించిన రాహుల్ గాంధీ.. తన తల్లిని చూసుకోవడం కోసం సోమవారం వరకూ విచారణను వాయిదా వేయాలని కోరారు.

దీంతో రాహుల్ గాంధీ అభ్యర్థనను సమ్మతించిన ఈడీ.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాంగ్రెస్ అధినేత్రిసోనియాగాంధీ ప్రస్తుతం కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం రాహుల్, ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో తల్లివద్దనే ఉంటున్నారు. ఇవాళ కూడా ఆస్పత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని.. అందుకే విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ ఈడీకి విజ్ఞప్తి చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో మూడు రోజుల్లో రాహుల్ గాంధీని 30 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. యంగ్ ఇండియన్ కంపెనీ కార్యకలాపాలు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్ ఆస్తులు సహా పలు అంశాలపై ఆరాతీశారు. ఆయన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రూపంలోనూ భద్రపరిచారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై ఢిల్లీ పోలీసుల దాడులు చేయడం పెను దుమారానికి దారితీసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ మహిళా ఎంపీ ఒకరు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు తనపై దాడి చేసి తన దుస్తులను చించివేశారని ఆమె మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

షనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను అక్రమంగా సోనియా, రాహుల్ సొంతం చేసుకున్నారని.. యంగ్ ఇండియా ద్వారా నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని... దాదాపు 2వేల కోట్ల ఆస్తులు కొల్లగొట్టారని సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. దీనిపై హైకోర్టు సోనియా, రాహుల్ లపై దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించింది.

వెంటనే యంగ్ ఇండియా- నేషనల్ హెరాల్డ్ ఆస్తులపై ఆదాయపు పన్ను డాక్యుమెంట్లను సమర్పించాలని హైకోర్టు.. సోనియా, రాహుల్ లను ఆదేశించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో సోనియా, రాహుల్ లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కొనసాగుతోంది.. మనీలాండరింగ్ విషయంలో ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతోంది.