Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌: రాహుల్ రీ ఎంట్రీతో హౌస్‌ లో షాక్‌ లే షాక్‌లు

By:  Tupaki Desk   |   24 Sep 2019 5:10 AM GMT
బిగ్‌ బాస్‌: రాహుల్ రీ ఎంట్రీతో హౌస్‌ లో షాక్‌ లే షాక్‌లు
X
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో....బిగ్ బాస్ వారాలు గడిచేకొద్దీ ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటి సభ్యులు తగ్గేకొద్దీ పోటీ పెరుగుతుంది. ఆదివారం ఎపిసోడ్ లో హిమజ ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే అంతకముందు శనివారం ఎపిసోడ్ లో రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్...అతన్ని సోమవారం ఎపిసోడ్‌ లో హౌస్ లోకి పంపారు.

సోమవారం ఎపిసోడ్ ప్రారంభమవ్వడమే శ్రీముఖి - బాబా భాస్కర్ మధ్య సరదాగా గొడవ జరిగింది. డ్యాన్స్ విషయంలో బాబా ఎక్స్ ప్రెషన్ పలకడం లేదని కామెంట్ చేసింది. ఇన్నాళ్ళు గడ్డంతో కవర్ చేశారు...గడ్డం తీశాక ఎక్స్ ప్రెషన్స్ పలకడం లేదా అంటూ ఆటపట్టించింది. ఆ తర్వాత వరుణ్ - పునర్నవి - వితికాలు ఒక చోట కూర్చుని రాహుల్ ఏం చేస్తున్నాడో అంటూ ఫీల్ అవుతూ ఉన్నారు. పునర్నవి అయితే కొంచెం ఎక్కువ బాధపడుతూ...ఏం చేస్తున్నాడో ఆ పంది.. బోర్ కొట్టినప్పుడల్లా వాడ్ని ఆటపట్టించేదాన్ని అంటూ రాహుల్ ని తలుచుకుంది.

ఇక రాహులా.. రాహులా ఏమైపోయావ్ రా అని కలవరిస్తూ వేదన పడుతుండగా.. బిగ్ బాస్ ఎంటరై ‘రాహుల్.. నువ్ బిగ్ బాస్ హౌస్‌ కి వెళ్లే టైం వచ్చిందని చెప్పాడు. దీంతో రాహుల్ హౌస్ లోకి వెళ్ళే ముందు కన్ఫెషన్ రూమ్ నుంచి అందరి ఆట గురించి చెబుతూ....పున్నూకు తన వాయిస్‌ తో ప్రేమ సందేశం పంపాడు. దీంతో పున్నూ ఆనందంతో గంతులు వేసింది. అలాగే మిగతా ఇంటి సభ్యులు కూడా రాహుల్ కోసం ఆతృతగా చూశారు. ఇక రాహుల్ హౌస్‌ లోకి అడుగుపెట్టగానే అందరూ ఆనందంగా కౌగిలించుకున్నారు. ఇక పున్నూ అయితే మరింత ప్రేమతో రాహుల్ ని తన కౌగిలిలో బందీ చేసుకుంది.