Begin typing your search above and press return to search.

కౌగిలింత రాజ‌కీయం గ‌బ్బు కొడుతుందే..!

By:  Tupaki Desk   |   27 July 2018 11:55 AM IST
కౌగిలింత రాజ‌కీయం గ‌బ్బు కొడుతుందే..!
X
రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా మాత్ర‌మే కానీ ప్ర‌ధాని మోడీ మీద త‌న‌కు ఎలాంటి ద్వేషం లేద‌ని.. కావాలంటే చూడాలంటూ పార్ల‌మెంటులో ప్ర‌ధాని మోడీని కౌగిలించుకోవ‌టం ద్వారా సంచ‌ల‌నం సృష్టించారు రాహుల్ గాంధీ. త‌న కౌగిలింత‌తో ప్ర‌ధాని మోడీలోనూ ద్వేషం పోగొడ‌తాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ కౌగిలింత ప్ర‌కంప‌న‌లు రాజ‌కీయంగా అంత‌కంత‌కూ ముదిరిపోతోంది.

ఈ కౌగిలింత‌పై బీజేపీ.. కాంగ్రెస్ మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం మ‌రో స్థాయికి చేరుకొని కంపు మాట‌ల దిశ‌గా వెళుతోంది. రాజ‌కీయంగా ఒక మెట్టు అధిక్యంలో ఉండాల‌న్న ఆత్రంలో ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం రాని రీతిలో నేత‌లు మాట్లాడ‌టం ఎక్కువ అవుతోంది. కౌగిలింత రాజ‌కీయంతో త‌న‌కు షాకిచ్చిన రాహుల్ కు.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప్ర‌ధాని మోడీ.. త‌న చేతి క‌ద‌లిక‌లతో ఎట‌కారం చేయ‌టం తెలిసిందే.

రాహుల్ తీరుపై త‌న‌కున్న ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించిన మోడీ క‌మ‌ల‌నాథుల‌కు ఇవ్వాల్సిన సందేశాన్ని ఇచ్చేశారు. అప్ప‌టి నుంచి రాహుల్ కౌగిలింత‌పై విరుచుకుప‌డిన బీజేపీ నేత‌ల‌కు పంచ్ ఇచ్చేలా.. రాహుల్ రియాక్ట్ కావ‌టం తెలిసిందే.బీజేపీ ఎంపీలు త‌న‌ను చూస్తే రెండు అడుగులు దూరం వెన‌క్కి వెళుతున్నారంటూ వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌ట‌మే కాదు.. చౌక‌బారు వ్యాఖ్య‌లు చేసి షాకిచ్చాడు. రాహుల్ త‌మ‌ను కూడా కౌగిలించుకుంటార‌నే భ‌యంతోనే తాము దూరం జ‌రుగుతున్నామ‌ని.. రాహుల్ పెళ్లి చేసుకుంటే ఆయ‌న్ను కౌగిలించుకునేందుకు సిద్ధ‌మ‌న్నారు.

స్వలింగ సంప‌ర్కాన్ని నేరంగా ప‌రిగ‌ణించే సెక్ష‌న్ 377 ఇంకా కొట్టివేయ‌లేద‌న్న ఆయ‌న‌.. రాహుల్ ను తాను కౌగిలించుకోబోన‌ని వివాదాస్ప‌దంగా వ్యాఖ్యానించారు. అవును.. రాహుల్ ను కౌగిలించుకుంటే మా భార్య‌లు మాకు విడాకులు ఇస్తారేమోన‌ని భ‌యంగా ఉందంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారంగా మారాయి రాజ‌కీయంలో మైలేజీ సాధించాల‌న్న త‌ప‌న త‌ప్పేం కాదు కానీ.. మ‌రీ ఇంత చౌక‌బారుగానా? అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ ను టార్గెట్ చేయాల‌న్న తొంద‌ర‌లో త‌మ ఇంటి ఆడ‌వారిని సైతం త‌మ వాద‌న‌ల్లోకి తీసుకురావ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.