Begin typing your search above and press return to search.

బీజేపీ, ట్విట్టర్ వార్ పై రాహుల్ సెటైర్లు

By:  Tupaki Desk   |   6 Jun 2021 2:30 PM GMT
బీజేపీ, ట్విట్టర్ వార్ పై రాహుల్ సెటైర్లు
X
కేంద్రంలోని బీజేపీకి, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మధ్య జరుగుతున్న వార్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. కోవిడ్19 వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న ఈ సమయంలో బీజేపీ నేతలు ట్విటర్ లో బ్లూటిక్స్ కోసం ఆరాటపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న అంశాలు ఇవేనన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ కావాలనుకునే వారు స్వయం సంవృద్ధి సాధించాలన్నారు.

రాహుల్ గాంధీ ఈ విమర్శలను ట్విట్టర్ లోనే చేయడం విశేషం. ‘మోడీ ప్రభుత్వం బ్లూటిక్స్ కోసం పోరాడుతోంది. మీకు కోవిడ్ 19 వ్యాక్సిన్ కావాలంటే స్వయం సంవృద్ధి కండి.. ప్రాధాన్యతలను గుర్తించి మసలుకోండి’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.

దేశంలోని ప్రముఖులు, గుర్తింపు పొందిన వారిని సోషల్ మీడియాలో ఈజీగా గుర్తించేందుకు.. వెరిఫైడ్ అకౌంట్లుగా నిర్ధారించేందుకు ట్విట్టర్ బ్లూ టిక్ ను పెడుతుంది.

ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర నేల ట్విట్టర్ అకౌంట్లకు బ్లూ టిక్ ను తొలగించి.. మళ్లీ పునరుద్దరించడం బీజేపీ ఆగ్రహానికి కారణమైంది. దానిపై నోటీసులును కేంద్రం జారీ చేసింది. దీనిపై రాహుల్ గాంధీ సెటైర్లు కురిపించారు.