Begin typing your search above and press return to search.

హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్, ప్రియాంక !

By:  Tupaki Desk   |   1 Oct 2020 1:04 PM IST
హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్, ప్రియాంక !
X
సామూహిక అత్యాచారం మరియు హింసకు గురై మరణించిన 19 ఏళ్ల బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి, కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీ వెళ్లనున్నారు. అయితే , ఇదే సమయంలో హత్రాస్ గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అత్యాచార ఘటనను విచారించే క్రమంలో భాగంగా సిట్ బృందం ఈ గ్రామంలోనే ఉంది. దీంతో మీడియాను సైతం అనుమతించడం లేదు. అంతేకాకుండా ఐదుగురి కంటే ఎక్కువ మంది ఎక్కడా గుమిగూడరాదని పోలీసులు ఆంక్షలు విధించారు.

బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మంగళవారం మరణించింది మరియు ఆమె మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున హత్రాస్ పోలీసులు దహనం చేశారు. ప్రియాంక గాంధీ పర్యటన గురించి రాహుల్ గురించి స్థానిక పరిపాలనకు సమాచారం లేదని హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ పి లక్ష్కర్, జిల్లాలో సెక్షన్ 144 విధించినట్లు తెలిపారు. కాగా -కరోనా వైరస్ పేరు చెప్పి అధికారులు హత్రాస్ జిల్లాను మూసివేశారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ ఈ జిల్లాను విజిట్ చేయకుండా సీల్ చేశారు.

హత్రాస్ ఘటన అత్యంత దారుణమని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సమాజానికే చెరగని మచ్ఛ అని అన్నారు. అటు-రాహుల్ ఈ ఘటనపై ట్వీట్ చేస్తూ, బాధితురాలి హత్యాచారానికి సంబంధించిన వాస్తవాలను యూపీ ప్రభుత్వం తొక్కిపెడుతోందని, ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా ఆమె కుటుంబాన్ని పోలీసులు అనుమతించకపోవడం అత్యంత ఘోరమని ఆరోపించారు.