Begin typing your search above and press return to search.
యువరాజు కాదు రాజేనట
By: Tupaki Desk | 1 Jun 2016 10:30 PM ISTకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ కు బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు సిద్ధమైనట్లు పెపద్ద ఎత్తున వార్తలు వెలువడుతున్నాయి. ఈనెలలోనే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి అయిన వర్కింగ్ కమిటీ సమావేశం జరిగే అవకాశముంది. ఈ మీటింగ్ లోనే రాహుల్ కు కొత్త బాధ్యతలపై నిర్ణయం తీసుకోవచ్చని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..పార్టీ పగ్గాలను మరో వ్యక్తికి అప్పగించే తరుణం వచ్చిందని సోనియాగాంధీ తనతో అన్నట్లు చెప్పారు. దీంతో రాహుల్ గాంధీ పదోన్నతి ఖరారైనట్టేనని ప్రచారం మొదలయ్యింది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో రాహుల్ మరికొన్నాళ్ళ పాటు ఉపాధ్యక్ష పదవిలో ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తుండడం, 2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావడం మొదలైన వాటి వల్ల రాహుల్ కు వెను వెటనే బాధ్యతల బదలాయింపు జరిపేయాలన్న అభిప్రాయానికి సోనియా వచ్చినట్లు చెబుతున్నారు. కేన్సర్ తో బాధ పడుతున్న సోనియా పూర్తి సమయం పార్టీకి వెచ్చించలేకపోవడం కూడా మరో కారణంగా చెప్తున్నారు.
ఓ రకంగా రాహుల్ కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఖరారైనట్లు గా చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ తరఫున నరేంద్ర మోడీ, థర్డ్ ఫ్రంట్ తరఫున నితిష్ కుమార్, కేజ్రీవాల్ లాంటి నేతల పేర్లు వినిపిస్తూన్నాయి. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటికే పొత్తుల వేటలో పడింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇది మరింత స్పష్టత రావొచ్చునని ఊహిస్తున్నారు.