Begin typing your search above and press return to search.
కేంద్రాన్ని కవితాత్మకంగా కడిగేస్తున్న రాహుల్
By: Tupaki Desk | 9 Jan 2021 10:15 PM ISTకాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన కవితా శైలిలో కేంద్రంపై సెటైర్లు వేశారు.
కవితలు.. ప్రాసలను ఉపయోగించాలనే రాహుల్ వ్యూహం చర్చనీయాంశమైంది. రాహుల్ లో వచ్చిన ఈ మార్పును అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ మారిపోయాడని అంటున్నారు. రాహుల్ ఈ శైలిని ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదని కాంగ్రెస్ నాయకులు ఓవైపు వెనకేసుకొస్తున్నారు.
శుక్రవారం రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.. "ఎవరి ఉద్దేశ్యం కరెక్టుగా లేదు, తేదీల తరువాత తేదీలు వాయిదాలు వేస్తున్నారు (తరీఖ్ పె తరీఖ్) ఇది వారి వ్యూహంగా కనిపిస్తోంది" అని రైతులతో చర్చలు విఫలమైన తరువాత కవితాత్వకంగా రాహుల్ గాంధీ కేంద్రాన్ని కడిగేశారు.
ప్రతి ట్వీట్ రాహుల్ రాసినప్పటికీ ఇతరుల నుండి ఇన్పుట్ తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియాలో 'రైతుల కోసం మాట్లాడండి' ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఈ క్రమంలోనే రైతుల కోసం మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఢిల్లీ సరిహద్దుల్లో గత 45 రోజులుగా రైతు నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు అస్పష్టంగా ఉన్నాయి. రైతులతో ఎనిమిదో రౌండ్ చర్చలు విఫలమైన తరువాత రాహుల్ గాంధీ ప్రభుత్వ ఉద్దేశ్యం.. వాయిదాలపై తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.