Begin typing your search above and press return to search.
రాహుల్ కు బుజ్జగింపులు... మామూలుగా లేవుగా
By: Tupaki Desk | 29 May 2019 7:00 AM ISTసార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మట్టి కరిచింది. అయితే గడచిన ఎన్నికల్లో కంటే ఓ 8 సీట్లను అధికంగా గెలిచింది. అయినా కూడా కేవలం పార్టీ గెలవలేదన్న కారణాన్ని చూపి ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ... పార్టీ పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఓటమికి తాను బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానన్న రాహుల్ ప్రకటన కాంగ్రెస్ లో పెను కలకలమే రేపిందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మాత్రమే పరాజయం దక్కలేదు. చాలా సార్లే ఆ పార్టీ ఓడింది. ఇప్పటి ఓటమి మరో ఓటమే తప్పించి...అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనే చెప్పాలి.
అయితే తాను పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే పార్టీకి పరాజయం రాహుల్ బాగానే కుంగదీసి ఉండవచ్చు. అయినంత మాత్రాన పార్టీ పగ్గాలను వదిలేస్తానని రాహుల్ ప్రకటించడమేంటి? అలా చేస్తే... ఇక పార్టీ ప్రస్థానం కొనసాగేదెలా? సరే... పార్టీలో సీనియర్లు చాలా మందే ఉన్నారు కదా. వారికి పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న రాహుల్ సూచన బాగానే ఉన్నా... ఫలితాలు వెలువడిన వెంటనే ఈ తరహా సంచలన నిర్ణయాలు అంత సరైనవి కాదు కదా. సరే... రాహుల్ రాజీనామా చేస్తానని చెప్పడం, వద్దని పార్టీ పెద్దలు ఆయనను అనునయించడం సర్వసాధారణమే కదా. అయితే ఈ ఓదార్పులు, బుజ్జగింపులు పరిధి దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో... ఇప్పుడు రాహుల్ పరిస్థితి అలాగే ఉందన్న వాదన వినిపిస్తోంది.
పార్టీకి చెందిన సీనియర్ నేతలు చాలా మందే ఇప్పటికే రాహుల్ ను బుజ్జగించారు. తాజాగా మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో సీనియర్లు, రాహుల్ సమకాలికులు ఆయన ఇంటికి పోటెత్తారు. పార్టీ పగ్గాలను వదులుతానంటూ ఇకపై చెప్పొద్దని, పార్టీ పగ్గాలు మీ చేతుల్లోనే ఉండాలని, పార్టీని ముందుకు మీరే నడిపించాలని, కష్టకాలంలో పార్టీ పదవిని వదిలితే ఎలా... ఇలా వచ్చిన ప్రతి నేత కూడా రాహుల్ కు తమదైన శైలిలో బుజ్జగించారు. ఈ బుజ్జగింపులను చూస్తుంటే... ఈ తరహా బుజ్జగింపులు గతంలో ఎప్పుడూ చూడలేదన్న వాదన వినిపిస్తోంది. మరి రాహుల్ గాంధీ ఈ బుజ్జగింపులకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.