Begin typing your search above and press return to search.

రెబల్ సిద్దూ.. సిద్దప్పను రాహుల్ పక్కనపెట్టేశాడా?

By:  Tupaki Desk   |   30 Jun 2021 8:00 PM IST
రెబల్ సిద్దూ.. సిద్దప్పను రాహుల్ పక్కనపెట్టేశాడా?
X
కాంగ్రెస్ లోని రెబల్స్ ను ఎప్పుడూ రాహుల్ గాంధీ ఎంకరేజ్ చేయరు. గతంలో మధ్యప్రదేశ్ లో తన ప్రియ శిష్యుడు జ్యోతిరాధిత్యసింధియా నాటి కాంగ్రెస్ సీఎంపై అసమ్మతి రాజేస్తే రాహుల్ ఊరుకోలేదు. తనకు క్లోజ్ ఫ్రెండ్ అయినా పక్కనపెట్టారు. దీంతో సింధియా బీజేపీలోకి చేరిపోయారు. అయినా రాహుల్ మాత్రం దానిపై వెనక్కి తగ్గలేదు.

ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైదొలిగి సీఎం అమరీందర్ సింగ్ పై తిరుగుబాటు ఎగురవేసిన ప్రముఖ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను సైతం రాహుల్ గాంధీ పక్కనపెట్టారు. పంజాబ్ నుంచి తనను కలిసేందుకు వచ్చినా కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం విశేషం.

అసమ్మతులపై తాను ఉక్కుపాదమే మోపుతానని సంకేతాలిస్తూ సిద్దూ వ్యతిరేకవర్గంతో రాహుల్ గాంధీ వరుస సమావేశాలు నిర్వహించారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ముఖం చాటేయడంతో ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీని సిద్దూ కలిశాడు. పంజాబ్ లోని కాంగ్రెస్ పరిస్థితులపై ఫిర్యాదు చేశాడు. పంజాబ్ లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళనపై ప్రియంకతో సిద్దూ చర్చించినట్టుగా తెలుస్తోంది.

ఇక సిద్దూతో భేటి అనంతరం ప్రియాంక గాంధీ నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇంటికి వెళ్లారు. అక్కడి పరిస్థితులపై వివరణ ఇచ్చారట.. కానీ సిద్దూకు ఎక్కడా ఊరట లభించలేదని.. కాంగ్రెస్ అధిష్టానం అక్కడి సీఎం అమరీందర్ సింగ్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.