Begin typing your search above and press return to search.

మల్టీప్లెక్స్ లో రాహుల్ గాంధీ, ఏ సినిమా చూశాడంటే!

By:  Tupaki Desk   |   6 July 2019 5:29 AM GMT
మల్టీప్లెక్స్ లో రాహుల్ గాంధీ, ఏ సినిమా చూశాడంటే!
X
ఏఐసీసీ అధ్యక్ష పదవి భారాన్ని దించుకున్న రాహుల్ గాంధీ సినిమాతో సేదతీరాడు. ఢిల్లీలో ఒక మల్టీప్లెక్స్ లో కనిపించాడు రాహుల్ గాంధీ. క్యాజువల్ డ్రస్ లో, చేతిలో పాప్ కార్న్ తో రాహుల్ ఆశ్చర్యపరిచాడు. అలా మల్టీప్లెక్స్ కు వచ్చిన రాహుల్ ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.

ఈ విషయంలో కొందరు రాహుల్ ను ప్రశంసిస్తూ ఉన్నారు. రాహుల్ డౌన్ టు ఎర్త్ మ్యాన్ అంటూ వారు కితాబిస్తున్నారు. అయితే మరి కొందరు యథారీతిన సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ గాంధీ తన స్థాయికి తగ్గట్టైన పని చేస్తూ ఉన్నారని వారు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

ఆ సంగతలా ఉంటే.. ఇంతకీ రాహుల్ గాంధీ ఏ సినిమాను చూశాడు? అనేది ఆసక్తిదాయకం. ఏ 'కబీర్ సింగ్' సినిమానో రాహుల్ చూశాడా.. అని కొందరు ఆరాతీస్తూ ఉన్నారు. అలాంటి హాట్ లవ్ స్టోరీలను రాహుల్ చూసేందుకు వెళ్లాడేమో అని కొందరు అనుకుంటున్నారు. అయితే రాహుల్ వెళ్లింది అలాంటి సినిమాకు కాదు. 'ఆర్టికల్ 15' సినిమాకు వెళ్లాడు రాహుల్. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమాను రాహుల్ వీక్షించాడు.