Begin typing your search above and press return to search.

అవెంజర్స్ తో చిల్ అయిన రాహుల్ గాంధీ!

By:  Tupaki Desk   |   2 May 2018 11:25 PM IST
అవెంజర్స్ తో చిల్ అయిన రాహుల్ గాంధీ!
X
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. నిన్న కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా సంతెమారహళ్లి భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ` హిందీ లేదా ఇంగ్లీషు లేదా మీ అమ్మగారి మాతృభాష అయిన ఇటాలియన్‌లో 15 నిమిషాలు కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాలను కాగితం చూడకుండా మాట్లాడండి’ అని మోడీ రాహుల్ కు సవాల్ విసిరారు. ఇలా ఓ వైపు ‘జన్‌ ఆక్రోశ్‌’.. మరోవైపు కర్ణాటక ఎన్నికల ప్రచారంతో నెల రోజులుగా బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాస్త రిలాక్సయ్యారు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారం ఓ వైపు హోరాహోరీగా సాగుతున్న స‌మ‌యంలో ఫ్రెండ్స్‌తో కలిసి ‘అవెంజర్స్‌’ సినిమా చూసి సేదతీరారు. ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌లో ఉన్న ఐనాక్స్‌ థియేటర్‌లో మంగళవారం సినిమాను వీక్షించారు. ఎప్పుడూ వైట్‌ అండ్‌ వైట్‌లో కనిపించే రాహుల్‌.. ఈసారి సరికొత్తగా టీషర్ట్‌లో థియేటర్‌కు వచ్చారు. ఇది స‌హ‌జంగానే విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. మరోపక్క దేశంలో రాజకీయం హాట్ హాట్‌గా ఉంటే సినిమాలు చూడ్డం ఏంటంటూ బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. 1984 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. ఆ పార్టీ అగ్రనేతలు వాజ్‌పేయి, అడ్వాణీ సినిమా చూశారని కమలం నేతలకు కౌంట‌ర్ ఇచ్చారు.