Begin typing your search above and press return to search.

డబ్బుల కోసం ‘యువరాజు’ క్యూలో నిలుచున్నారు

By:  Tupaki Desk   |   11 Nov 2016 2:22 PM GMT
డబ్బుల కోసం ‘యువరాజు’ క్యూలో నిలుచున్నారు
X
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు కొందరు తప్పు పట్టినా.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కానీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కానీ నోరు విప్పింది లేదు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి యువరాజు లాంటి రాహుల్.. ఈ రోజు ఎస్ బీఐ ఏటీఎం వద్దకు డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చారు. దేశాన్ని పదేళ్ల పాటు రిమోట్ తో పాలించిన మహారాణి పుత్రుడు.. మాజీ ప్రధానమంత్రి కుమారుడి చేతిలో చిల్లర ఖర్చులకు డబ్బుల్లేవా? అన్న సందేహం వ్యక్తమైంది. అయితే.. పెద్దనోట్లరద్దు విషయంలోమోడీ తీసుకున్ననిర్ణయం కారణంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని తెలియజెప్పటం కోసం.. ఒక్కొక్కళ్లు ఎంతసేపు క్యూలో నిలుచోవాల్సి వస్తుందో స్వయంగా తెలుసుకునేందుకే రాహుల్ ఏటీఎం వద్దకు వచ్చినట్లుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆయన పార్లమెంటు స్ట్రీట్ లోని ఎస్ బీఐ బ్రాంచ్ ఏటీఎం వద్దకు వచ్చారు. మిగిలిన వారితో పాటు క్యూలో నిలుచున్న ఆయన.. తన వంతు వచ్చాక లోపలికి వెళ్లి రూ.4వేల మొత్తాన్ని తెచ్చుకొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తో సెల్పీలు దిగేందుకు క్యూలో నిలుచున్న వారంతా పోటీ పడ్డారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని.. ఆయన రాక కారణంగా మరింత ఆలస్యమైందని కొందరు విస్కుకుంటే.. ఇంట్లో ఉన్న నోట్లు పనికి రాకపోవటంతో చేతి ఖర్చుల కోసం అంత పెద్ద యువరాజు రోడ్డు మీదకు వచ్చారే అంటూ మరికొందరు సరదాగా వ్యాఖ్యలు చేసుకోవటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/