Begin typing your search above and press return to search.

మీరు పవరున్న రాష్ట్రాల్లో అలా చేయరేం?

By:  Tupaki Desk   |   16 Nov 2016 8:22 PM IST
మీరు పవరున్న రాష్ట్రాల్లో అలా చేయరేం?
X
నీతులు చెప్పేందుకే కానీ చేసేందుకు కాదని ఊరికే అనలేదేమో. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కమ్ యువరాజు రాహుల్ గాంధీ మాటలు చూస్తే అచ్చం ఇలానే ఉంటుంది. నోరు తెరిస్తే నీతులు చెప్పే అయ్యగారు.. చేతల్లో మాత్రం చేసి చూపించనే చూపించరు. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఆయన నిర్ణయం తప్పని చెప్పేందుకు రాహుల్ గాంధీ పడుతున్న తిప్పలు అన్నీఇన్నీ కావు. మొన్నటికి మొన్న చేతిలో చిల్లర డబ్బులు అయిపోయినట్లుగా ఏటీఎం వద్దకు వచ్చి డబ్బులు తీసుకున్న ఆయన.. తాజాగా మరోసారి ముంబయిలో ఏటీఎం షో చేశారు.

ఆర్ ఎస్ ఎస్ వేసిన పరువు నష్టం దావా కేసులో హాజరయ్యేందుకు భివండి కోర్టుకు వచ్చిన ఆయన.. మహారాష్ట్రకు మంగళవారం రాత్రే చేరుకున్నారు. ఉదయం కోర్టులో బెయిల్ పొందిన ఆయన.. ముంబయిలోని వకోలా ఎస్ బీఐ ఏటీఎం వద్ద క్యూలైన్లో నిల్చున్నారు. ఈ సందర్భంగా ఏటీఎం క్యూ సెంటర్లలో వేచి ఉన్న ప్రజలతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏటీఎంల వద్ద పెద్ద ఎత్తున క్యూలలో నిలుచున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిఅవుతున్నారంటూ నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పు పట్టిన ఆయన.. నోట్ల మార్పిడి సందర్భంగా ప్రజలు పడుతున్న అవస్థల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఏటీఎంల వద్ద తాగునీరు ఏర్పాటు చేయాలన్న సూచన చేశారు.

ఈ తరహా సూచన మంచిదే.కానీ.. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి వసతులు కల్పించిన తర్వాత.. దాన్ని ఉదాహరణగా చూపించి అదేతీరులో మెరుగైన సేవలు అందించమని చెబితే బాగుంటుంది. అలాంటిదేమీ లేకుండా.. తమ ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నరాష్ట్రానికి వచ్చి.. ఇలాంటి సలహాలు ఇవ్వటం రాహుల్ కు మాత్రమే చెల్లుతుందేమో..? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏటీఎం ఇబ్బందులకు గురి అవుతున్న కష్టాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో రాహుల్ వివరిస్తే మరింత బాగుంటుదేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/