Begin typing your search above and press return to search.

ఏపీలో యువరాజు 10కిమీ నడుస్తాడంట

By:  Tupaki Desk   |   16 July 2015 2:20 AM IST
ఏపీలో యువరాజు 10కిమీ నడుస్తాడంట
X
యువరాజు ఏపీకి వచ్చేస్తున్నాడు. మాకు న్యాయం చేయండి మహాప్రభో అన్నప్పుడు కానీ.. దారుణంగా విభజన చేసి పారేసి.. ఇష్టారాజ్యంగా విభజన లెక్కలకు సంబంధించిన చట్టాన్ని రాసే సమయంలో కనిపించని ఏపీ.. ఇప్పుడు కనిపిస్తోంది.

ఐదు కోట్ల మంది ఆంధ్రులు తమ బతుకు మార్చాలని.. విభజన కారణంగా నష్టపోయిన తమ తరఫు మాట్లాడే వారి కోసం.. పోరాడే వారి కోసం చూసిన దురుచూపులు వృధా అన్న విషయం తేలిపోయింది. విభజన సమయంలో పట్టించుకోని రాహుల్.. విభజన తర్వాత అయినా ఏపీ ప్రజలకు న్యాయబద్ధంగా అందాల్సిన అంశాలపై గళం విప్పుతారని ఆశ పడ్డవారికి అదెంత దురాశ అన్నది అర్థమైంది.

ఇలా.. ఏ దశలోనూ ఆంధ్రులకు అండగా నిలవని రాహుల్.. తాజాగా మాత్రం ఏపీ వస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు.. చేనేత కార్మికులకు సంబంధించి 70 కుటుంబాలకు సాయం పేరిట చెక్కులు పంపిణీ చేయాలని డిసైడ్ చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశమై వారి కష్టాల గురించి ఆరా తీయనున్నారు.

ఇందుకోసం ఆయన జూలై 24 ఏపీకి రానున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓడిసి నుంచి కొండకమర్ల వరకు నడవనున్నారు. ఆయన నడకలో ఐదు ఊళ్లు కవర్ కానున్నాయి. రాహుల్ ఏపీ పర్యటనను విజయవంతం చేయటానికి కాంగ్రెస్ నేతలు కసరత్తు మొదలు పెట్టారు. వివిధ వర్గాల్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి యువరాజా వారు.. ప్రజలు కోరుకున్న సమయంలో కాకుండా.. తనకు నచ్చిన సమయంలో పర్యటనకు వస్తూ.. తన రాజరిక దర్పాన్ని చెప్పకనే ప్రదర్శిస్తున్నట్లు ఉంది కదూ.