Begin typing your search above and press return to search.
చేసిన పాపానికి ఈ మాట సరిపోదు రాహుల్!
By: Tupaki Desk | 6 March 2018 4:37 PM ISTఏపీకి ఇప్పుడున్న దరిద్రపు పరిస్థితికి కారణం ఏమిటి? అన్నంతనే వినిపించేది కాంగ్రెస్ పేరు. ఆ పార్టీ కానీ ఏపీ విభజన సందర్భంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఇప్పుడున్న పరిస్థితి ఉండేదే కాదు. విభజన చట్టాన్ని హడావుడితో లోపాల కుప్పగా తయారు చేయటమేకాదు.. ఏపీకి ఇవ్వాల్సిన వరాల విషయంలో చట్టబద్ధత లేకుండా.. మాట వరసకు చెప్పటం ద్వారా తాము అనుకున్నది చేసేశారు.
దీనికి ఆ పార్టీ చెల్లించాల్సిన మూల్యం చెల్లించటమేకాదు.. రానున్న మరో ఇరవై ఏళ్ల వరకూ ఆ పార్టీ ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి. హోదా విషయంలో మోడీ ఏదో చేస్తారంటే.. ఆయన కూడా హ్యాండ్ ఇవ్వటంతో ఇప్పడు ఆ అంశంపై ఏపీ నేతలంతా కలిసి భారీ ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారు. ఎవరికి వారుగా తమ ఆందోళనల్ని ఉధృతం చేస్తున్నారు. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా మీద రియాక్ట్ అయ్యారు.
ఏపీ కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న ఆంధ్రుల ఆత్మగౌరవదీక్షలో పాల్గొన్న రాహుల్.. సంఘీభావాన్ని తెలపటమే కాదు..ప్రత్యేక హోదా సాధనలో ఆంధ్రులకు తాను అండగా ఉంటానని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకహోదా ఇస్తామన్నారు. అయితే.. రాహుల్ హామీ సరిపోదన్న వాదన వినిపిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో..తమ పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఏపీకి ఏం చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పటమే కాదు.. టైం లైన్ ను సైతం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. తాము అధికారాన్ని చేపట్టిన మరుక్షణం ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చే ఫైల్ మీద సంతకం చేస్తామన్న మాటతో పాటు.. విభజన చట్టంలో మార్పు చేసి ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వనున్నట్లు చేర్చటంతో పాటు.. హోదాలో భాగంగా ఏపీకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వటం.. ఏదైనా ప్రభుత్వం సకాలంలో ఇవ్వని పక్షంలో.. ఏపీకి ఎలా సాయం అందుతుందన్న విషయంపై క్లారిటీ ఇస్తే రాహుల్ హామీని నమ్మొచ్చు. అంతేకానీ.. ఏదో వచ్చి.. మరేదో మాట్లాడి వెళితే సరిపోదన్న విషయాన్ని రాహుల్ గుర్తిస్తే మంచిది.