Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ పెళ్లికొడుకు అవుతున్నాడట..

By:  Tupaki Desk   |   5 July 2016 3:43 PM IST
రాహుల్ గాంధీ పెళ్లికొడుకు అవుతున్నాడట..
X
రాహుల్ గాంధీ విషయంలో జనం చాలాకాలంగా మర్చిపోయిన అంశం మళ్లీ కదిలింది. హాఫ్ సెంచరీకి రీచ్ అవుతున్న రాహుల్ పెళ్లి విషయంపై ప్రజలకు అనేక సందేహాలున్నాయి.. ఆయనకు ఇప్పటికే పెళ్లయిందని చాలామంది నమ్ముతుంటారు.. లేదు ఇంకా చేసుకోలేదని అంటుంటారు. తాజాగా రాహుల్ పెళ్లి విషయం ఒక్కసారిగా హాట్ టాపిగ్గా మారిపోయింది. రాహుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అయితే.. రాహుల్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయంలోనూ అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమెకు విదేశాల్లో గర్ల్ ఫ్రెండ్సు ఉన్నారని.. వారిలో ఒకరిని చేసుకుంటారని గతంలో ప్రచారం జరిగింది. అయితే.. తాజాగా మాత్రం అచ్చంగా ఉత్తర్ ప్రదేశ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.

రాహుల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయని.. రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తని తెలుస్తోంది. దీనిపై రాహుల్ కార్యాలయం నుంచి మాత్రం ఎలాంటి సమచారం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ వర్గాలు కూడా చాలా గుంభనంగా ఉంటున్నాయి. దీంతో ఈ 46 ఏళ్ల బ్యాచిలర్ ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరన్నది ఇంకా తేలలేదు. కానీ... పెళ్లి మాత్రం గ్యారంటీ అని తెలుస్తోంది.