Begin typing your search above and press return to search.

రాహుల్ సంక‌టం..ఓటు ఎవ‌రికి అడుగుతున్నారు

By:  Tupaki Desk   |   31 March 2019 7:31 AM GMT
రాహుల్ సంక‌టం..ఓటు ఎవ‌రికి అడుగుతున్నారు
X
కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థి రాహుల్ గాంధీ ఈరోజు ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చారు. కోస్తాంధ్ర‌లో విజ‌య‌వాడ‌లోనూ - రాయ‌ల‌సీమ‌లో క‌ళ్యాణ‌దుర్గంలోనూ ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. ఒక‌టేమో రాజ‌ధాని. ఇంకోటేమో పీసీసీ అధ్య‌క్షుడు పోటీ చేస్తున్న స్థానం. స‌రే ఒక జాతీయ పార్టీ అధ్య‌క్షుడు. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కాబ‌ట్టి ప్రచారానికి వ‌చ్చారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది... కేంద్రంలో బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలో తెలుగుదేశం - కాంగ్రెస్ రెండూ ఉన్నాయి. దీంతో రాహుల్ ప్ర‌చారంలో ఎవ‌రికి ఓటేయ‌మ‌ని అడుగుతున్నార‌నేది ఇపుడు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న. ఎమ్మెల్యేల వ‌ర‌కు అయితే ఓ క్లారిటీ ఉంది. కాంగ్రెస్‌ కే వేయండని అడుగుతున్నారు. మ‌రి ఢిల్లీలో వారితో చంద్ర‌బాబు క‌లిసున్న నేప‌థ్యంలో లోక్‌స‌భ‌కు చంద్ర‌బాబుకు వేయాలా? ఆంధ్రులు కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు వెయ్యాలా? ఇది నిజంగా రాహుల్ సంక‌ట‌మే. ఏదో నామ్‌కే వాస్తే ప్ర‌చార‌మే గాని... లోక్‌ స‌భ సీట్ల‌న్నీ త‌మ మిత్రుడు చంద్ర‌బాబుకు రావాల‌న్న‌ది రాహుల్ మ‌నోగ‌తం అని విశ్లేష‌కుల మాట‌. ఎందుకంటే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒక్క లోక్‌ స‌భ సీటు కూడా కాంగ్రెస్‌ కు రాదు. ఒక‌వేళ అసెంబ్లీలో రెండు మూడు సీట్లు వ‌స్తాయోమో గానీ... లోక్‌ స‌భ‌లో అయితే గ్యారంటీగా కాంగ్‌ కి ప‌డ‌వు. అందుకే ఆ ఓట్లు బాబుకే ప‌డితే మేల‌న్న‌ది కాంగ్రెస్ నేత‌ల భావ‌న కూడా.

ఇదిలా ఉంటే... రాహుల్ విజ‌య‌వాడ‌లో ప్ర‌త్యేక హోదాపై మ‌రోసారి హామీ ఇచ్చారు. *ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్‌ తోనే సాధ్యమని - అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని** కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ భ‌రోసా స‌భ పేరిట నిర్వ‌హిస్తున్ ఈ స‌భ‌లో ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ పార్లమెంట్‌ లో ప్రకటించారు. మోడీ ప్ర‌ధాని అయ్యాక ఆ హామీని తొక్కిపెట్టి ఆంధ్రుల‌ను మోసం చేశారు. దీనిపై స్థానిక పార్టీలు మోదీని ఎందుకు నిలదీయడం లేదు? అని రాహుల్ ప్రశ్నించారు. దేశ ప్రజల సాక్షిగా ఏపీకి వాగ్దానం ఇచ్చామని - ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీకి హోదా అంశం ఉంద‌ని.. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తుంది, ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంది... అని రాహుల్ వ్యాఖ్యానించారు.