Begin typing your search above and press return to search.
రాహులేంది... తెలుగు సీఎంలపై పడ్డారు
By: Tupaki Desk | 5 July 2016 4:49 PM ISTఎక్కడికి వెళ్లాడో తెలియకుండా.. ఎవరితో వెళ్లాడో తెలియకుండా విదేశాలకు వెళ్లి.. అక్కడ విశ్రాంతి తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాగానే పాలిటిక్సులో పడ్డారు. యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడానికి తల్లి సహా - పార్టీ పెద్దలతో మీటయ్యారు. తల్లి సోనియా సహా గులాం నబీ ఆజాద్ తదితరులతో కలసి మూడు గంటల పాటు సమాలోచనలు జరిపి భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రాల్లో పర్యటించి పార్టీకి ఊపు తేవాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా తొలుత ఆయన కన్ను తెలుగు రాష్ర్టాలపైనే పడింది. ఏపీ - తెలంగాణల్లో చట్టాల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించినున్నట్లు చెబుతున్నారు.
2006 నాటి అటవీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న రాష్ట్రాలపై ఆయన ఉద్యమించనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అటవీ చట్టాల ఉల్లంఘన అధికంగా ఉన్న తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లతో పాటు చత్తీస్ గఢ్ - ఒడిశా - జార్ఖండ్ - మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఆరు నెలల పాటు జరిగే ప్రత్యేక నిరసనల కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. యూపీఏ హయాంలో తీసుకువచ్చిన అటవీ పరిరక్షణ చట్టానికి ఈ రాష్ట్రాల్లో తూట్లు పొడుస్తున్నారని, కేంద్రం చూసీ చూడకుండా ఉన్నందునే రాహుల్ ఉద్యమించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
భూ సేకరణ చట్టానికి మార్పుల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కూడా రాహుల్ భావిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధమవుతుందని సమాచారం. తన ఉద్యమాన్ని తొలుత ఏపీ - తెలంగాణ నుంచి ప్రారంభించాలని.. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ పూర్తిగా కుదేలవడంతో తక్షణం వీటిపై దృష్టిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన పర్యటన కేసీఆర్ - చంద్రబాబులపై దండయాత్రగానే చెప్పాలి. అయితే.. వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ - పంజాబ్ - ఉత్తరాఖండ్ రాష్ట్రాలను వదిలి ఆయన మరో ఆరు రాష్ట్రాల్లో పర్యటనలు జరపడం మాత్రం ఎలాంటి వ్యూహమో కాంగ్రెస్ పార్టీయే చెప్పాలి.