Begin typing your search above and press return to search.

మనికోటి బ్రదర్ తో యువరాజు మాట్లాడారు

By:  Tupaki Desk   |   10 Aug 2015 10:08 AM IST
మనికోటి బ్రదర్ తో యువరాజు మాట్లాడారు
X
ఒక నిండు ప్రాణం రాజకీయాలకు బలైంది. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించే వైఖరి పట్ల గుండె మండిన ఒక వ్యక్తి జీవితం అర్థాంతరంగా ఆగిపోయింది. విభజన కారణంగా ఏపీకి జరుగుతున్న నష్టాన్ని చూసి తట్టుకోలేక.. ఏపీ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన ప్రత్యేక హోదా విషయంలో గళం విప్పటమే కాదు.. తన ప్రాణత్యాగం ద్వారా రాజకీయ పార్టీల్లో చురుకు పుట్టించాలన్న భావనతో.. తిరుపతికి చెందిన మునికోటి ఆత్మాహత్యా యత్నానికి పాల్పడ్డారు.

తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మునికోటిని డాక్టర్లు రక్షించలేకపోయారు. మునికోటి బలవన్మరణం ఏపీలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మునికోటి మరణం ముందు ఏపీ ప్రత్యేక హోదా గురించి పై పూత మాటలే తప్పించి.. ఏపార్టీ సీరియస్ గా తీసుకున్నది లేదు. కానీ.. మునికోటి చనిపోయాడనగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం లైన్లో కి వచ్చేశారు

మునికోటి సోదరుడి తో ఆయన మాట్లాడారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడిన్ని హామీలు ఇచ్చిన రాహుల్.. ఏపీ ప్రత్యేక హోదా గురించి పార్లమెంటు వేదిక మీద.. అధికారపక్షాన్ని గట్టి నిలదీసింది లేదు. కానీ.. ఈ రోజు మాత్రం ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. మనిషి పోయిన తర్వాత నిద్రలేచే బదులు.. ముందు మేల్కోవటం యువరాజు రాహుల్ కు అలవాటు లేదా?