Begin typing your search above and press return to search.

యూరప్ నుంచి రాగానే యువరాజుకు పగ్గాలు?

By:  Tupaki Desk   |   2 Jan 2016 10:59 AM IST
యూరప్ నుంచి రాగానే యువరాజుకు పగ్గాలు?
X
అధికారిక కార్యకలాపాల కోసం ప్రధాని మోడీ తరచూ విదేశాలకు వెళుతుంటారని అందరూ విమర్శిస్తూ ఉంటారు. కానీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం విదేశాలకు వెళుతుంటారు. కానీ.. విపక్షంలో ఉండటంతో పాటు.. తాను విదేశీ పర్యటలనకు వెళ్లిన ప్రతిసారి ఆ వివరాల్ని బహిరంగంగా వెల్లడించకపోవటంతో ఆయన ఫారిన్ ట్రిప్స్ గురించి బయటకు పొక్కే సమాచారం తక్కువే.

అయితే.. గతానికి భిన్నంగా ఈసారి ఆయన అధికారికంగా ప్రకటించి మరీ విదేశీ ప్రయాణానికి వెళ్లారు. ఎప్పుడూ విదేశాలకు వెళుతున్న విషయాన్ని కూడా వెల్లడించని రాహుల్.. ఈసారి ఫారిన్ ట్రిప్ వివరాలు చెప్పటమే కాదు.. తాను వెళుతున్నది ఎక్కడికన్న విషయాన్ని కూడా వెల్లడించారు. తాను ఈసారి యూరప్ వెళుతున్నట్లుగా రాహుల్ పేర్కొన్నారు.

అయితే.. ఈసారి విదేశీ పర్యటన ముగించుకొచ్చిన వెంటనే.. ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. రాహుల్ విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన తర్వాత.. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనవరి 8 తర్వాత ఎప్పుడైనా తన పర్యటనను ముగించుకొని వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాహుల్ తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని.. ఆ సమావేశంలో ఆయనకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. రాహుల్ కు పార్టీ పగ్గాలన్న వాదన వినిపించటం..ఆ తర్వాత అదంతా ఉత్తమాటే అని కొట్టేస్తూ పరిణామాలు చోటు చేసుకోవటం మామూలే. ఈసారి కూడా అలాంటిదేన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడురాహుల్ కు పగ్గాలు అప్పగించాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. రాహుల్ తిరిగి వచ్చిన తర్వాత కానీ.. పగ్గాలు చేపట్టేదీ.. లేనిదీ తేలే అవకాశం ఉంది.