Begin typing your search above and press return to search.
పవర్లోకి రావటంతోనే ఏపీకి హోదా: రాహుల్
By: Tupaki Desk | 4 Jun 2017 10:22 PM ISTరాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదాకు సంబంధించి కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. విభజన నిర్ణయంతో ఏపీలో భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీకి ఊపిరిని అందించేలా కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. తాజాగా గుంటూరులో భారీ బహిరంగ సభను నిర్వహించిన ఆయన.. హోదా అంశంపై ఏపీ ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తేలా కొత్త హామీని ఇచ్చారు. ఏ విషయంలో అడుగు ముందుకేసి పార్టీని సర్వనాశనం చేసుకున్నారో.. సరిగ్గా అదే విషయానికి సంబంధించిన ఒక అంశంపై కీలక హామీ ఇవ్వటమే కాదు.. తనతో పాటు యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతల్ని ఏపీకి తీసుకువచ్చి.. వారందరి సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదాను ఇస్తామన్న కీలక ప్రకటన చేశారు. 2019 లో తాము అధికారంలోకి వస్తే.. మొట్టమొదటిగా చేసేది ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చటంగా చెప్పటమేకాదు.. హోదా అన్నది ఏపీ ప్రజల హక్కుగా ప్రకటించారు. రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లో చూస్తే..
+ హోదా హామీని మన్మోహన్ ఒక్కరే ఇవ్వలేదు. ఆయన భారత దేశ ప్రధానిగా ఈ హామీని ఏపీ ప్రజలకు ఇచ్చారు
+ ప్రత్యేక హోదా గురించి మీకు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను
+ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చే నిధుల్ని 70 శాతం అప్పుగా 30 శాతం గ్రాంటుగా ఇస్తారు
+ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం 90 శాతం గ్రాంటు రూపంలో ఇస్తుంది
+ ఏపీకి హోదా ఉంటే.. కొన్ని వేల కోట్ల రూపాయిలు గ్రాంటు రూపంలో వస్తాయి
+ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే.. ఇన్ని డబ్బుల్ని చంద్రబాబు పార్టీ కానీ.. జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఎందుకు వద్దంటున్నాయి?
+ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాను ఎందుకు అక్కర్లేదంటున్నారు?
+ హోదా కోసం పోరాడే ధైర్యం చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డిలకు లేదు
+ మోడీ భయంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి అడగలేకపోతున్నారు.
+ మోడీ హిందూ ధర్మం గురించి చెబుతుంటారు. ఆయన హిందు ధర్మాన్ని పరిరక్షిస్తామంటారు
+ అలాంటి మోడీ.. తిరుపతిలో ఏపీ ప్రజలకు హోదా మీద హామీ ఇచ్చారు
+ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి సాక్షిగా పదేళ్ల పాటు హోదా ఇస్తానని హామీ ఇచ్చారు
+ మరి.. అలాంటి మోడీ తన హామీని ఎందుకు నెరవేర్చటం లేదు?
+ ఇలా చూసినప్పుడు ఆయన ఏ రకమైన హిందువు అవుతారు? పరమ పుణ్యక్షేత్రమైన తిరుపతి సాక్షిగా ఇచ్చిన హామీని నిలుపుకోరా?
+ ఈ సభకు దేశంలో పలు పార్టీలకు చెందిన నేతలంతా ఇక్కడ ఉన్నారు. వారంతా ఏపీకి హోదా ఇవ్వమంటున్నారు.
+ కానీ.. ఏపీకి చెందిన రెండు పార్టీలు మాత్రం ప్రత్యేక హోదా ఎందుకు వద్దంటున్నాయి?
+ వారికి ఉన్న ప్రత్యేక ప్యాకేజీ ఏమిటి?
+ వారికి మోడీకి సంబంధించి ఏదో భయం ఉంది
+ అయితే.. కాంగ్రెస్ కానీ.. ఈ వేదిక మీద ఉన్న పార్టీ నేతలకు కానీ మోడీ అంటే ఎలాంటి భయం లేదు
+ చంద్రబాబు కానీ జగన్ కానీ మీ గురించి పోరాడకపోతే.. మేమంతా కలిసి హోదా సాధిస్తాం
+ మేం మీకు చేస్తామని చెబుతున్న ప్రత్యేక హోదా ఏమీ మీకు మేం తోఫా ఏం ఇవ్వటం లేదు. అది మీ హక్కు.
+ భారత దేశ ప్రధాని ఏపీ ప్రజలకు హోదా ఇస్తానని హామీ ఇచ్చారని మర్చిపోకూడదు
+ ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ గురించి చెబుతారు. కానీ.. ఇక్కడ ఒక కిలోమీటర్ మొత్తం దుర్గంధంతో ఉంది. ఇదేనా స్వచ్ఛభారత్ అంటే?
+ మీడియా ముందు చీపురు ఉడుస్తుంటారు. కానీ.. ఆయనకు చీపురు పట్టుకోవటం కూడా రాదు
+ మీరు చీపుర్లతో ఊడుస్తుండండి.. నేను అమెరికాకు వెళ్లి వస్తానంటారు
+ అంతలోనే స్వచ్‌ఛభారత్‌ను వదిలేసి.. మేకిన్ ఇండియా అంటూ మొదలుపెట్టారు
+ తనది 56 అంగుళాల ఛాతీ అని చెబుతారు మోడీ. మేం పార్లమెంటులో మోడీని .. ఈ 56 ఛాతీ అంగుళాలున్న వ్యక్తి దేశ ప్రజలకు ఎన్ని ఉద్యోగులు ఇచ్చారని అడుగుతున్నాం
+ రెండుకోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు. కానీ.. మూడేళ్ల వ్యవధిలో లక్ష వరకూ మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు
+ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జిల్లాలో ఇచ్చినన్ని ఉద్యోగాలు కూడా మోడీ ఇవ్వలేదు
+ విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన మొత్తం ఖర్చు గురించి చట్టంలో చెప్పాం. కానీ.. మీ ముఖ్యమంత్రి మాత్రం పోలవరం ప్రాజెక్టు కేంద్రం పూర్తి చేస్తానంటే.. అక్కర్లేదు తానే పూర్తి చేస్తానంటాడు.
+ పోలవరం ప్రాజెక్టు కేంద్రం డబ్బుతో ఖర్చు చేస్తే ఎవరికి కమిషన్లు వెళ్లవు. అందుకే చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును తామే కడతానని అంటుంటారు
+ నరేంద్రమోడీ ఏం ప్రభావం చూపించారో కానీ.. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మర్చిపోయారు
+ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చే నిధులు అక్కర్లేదంటున్నారు.
+ మోడీ.. చంద్రబాబులు తరచూ అవినీతి గురించి మాట్లాడుతుంటారు. మేం అవినీతికి వ్యతిరేకంగా భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చాం. రైతులు నస్టపోకుండా చేశాం. కానీ.. మూడుసార్లు మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారు. కానీ.. మేం.. మాతో ఉన్న పార్టీలు కలిసి అడ్డుకున్నాం. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భూసేకరణ బిల్లుకు తూట్లు పొడిచారు
+ నేను మీకు హామీ ఇస్తున్నాం. 2018లో కాంగ్రెస్ తో కూడిన యూపీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే.. మొట్టమొదటిగా నెరవేర్చే హామీ.. ఏపీకి ప్రత్యేక హోదా. ఇదేమీ మీకు బహుమతి ఇస్తున్నామని చెప్పటం లేదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
+ దేశంలోని వేర్వేరు రాష్ట్రాల నుంచి ఇక్కడకు చాలామంది నేతలు వచ్చారు. వారంతా ఏపీ కోసమే వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వారంతా సుముఖంగా ఉన్నారు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/