Begin typing your search above and press return to search.

ప‌శుప‌తినాథ్ టెంపుల్ కు రాహుల్ డుమ్మా..?

By:  Tupaki Desk   |   2 Sept 2018 10:15 AM IST
ప‌శుప‌తినాథ్ టెంపుల్ కు రాహుల్ డుమ్మా..?
X
కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి శివుడు అంటే ఇష్ట‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర‌లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయ‌న నేపాల్ నుంచి టిబెట్ రాజ‌ధాని లాసాకు చేరుకున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఖాట్మండులోని ప‌శుప‌తినాథ్ దేవాల‌యాన్ని ఆయ‌న సంద‌ర్శించుకోవాల్సి ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ టెంపుల్ కు వెళ్లాల్సి ఉన్నా..ఆయ‌న వెళ్ల‌లేదు. శ‌నివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ ఖాట్మండులోనే ఉన్న రాహుల్.. ఆ త‌ర్వాత లాసాకు వెళ్లిపోయిన‌ట్లుగా నేపాల్ అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఎందుకిలా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రాహుల్ ప‌ర్య‌ట‌న మొత్తం వ్య‌క్తిగ‌తం కావ‌టంతో త‌మ వ‌ద్ద వివ‌రాలు పెద్ద‌గా లేవ‌న్న మాట‌ను అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రిత‌మే ప్ర‌ధాని మోడీ త‌న నేపాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌శుప‌తినాథ్ దేవాల‌యాన్ని ద‌ర్శించుకోవ‌టం వ‌ల్లే రాహుల్.. వెళ్ల‌లేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఇదిలా ఉంటే.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగానే ఖాట్మాండు నుంచి ఆయ‌న లాసాకు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. లాసా నుంచి కైలాస మాన‌స స‌రోవ‌రం రెండు వేల కిలోమీట‌ర్ల దూరం ఉంది. రాహుల్ ప్రయాణం రోడ్డు మార్గంలో సాగుతుందా? విమానంలో జ‌రుగుతుందా? అన్న విష‌యాలు బ‌య‌ట‌కు రాలేదు. త‌న కంటే ముందుగా.. అదీ రెండు రోజుల ముందు ప‌శుప‌తినాథ్ దేవాల‌యాన్ని మోడీ ద‌ర్శించుకున్న కార‌ణంగానే రాహుల్ టెంపుల్ కు వెళ్లే కార్య‌క్ర‌మం క్యాన్సిల్ అయిన‌ట్లుగా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.