Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీకి షాకిచ్చిన ట్విట్టర్

By:  Tupaki Desk   |   8 Aug 2021 9:36 AM IST
రాహుల్ గాంధీకి షాకిచ్చిన ట్విట్టర్
X
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గట్టి షాక్ ఇచ్చింది. ఆయన అధికారిక ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసి కాంగ్రెస్ వర్గాలకు కోలుకోలేని దెబ్బ తీసింది. దీనిపై కాంగ్రెస్ వాదులు, ఫ్యాన్స్ ట్విట్టర్ పై దుమ్మెత్తి పోశారు. రాహుల్ సహా కీలక నేతలు సీరియస్ గా స్పందించారు.

కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా దీనిపై ట్వీట్ చేసింది. 'రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేశారు.దాని పునరుద్ధరణ కోసం తగిన ప్రక్రియను అనుసరిస్తున్నారు' అని పేర్కొంది.

''రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా పునరుద్దరించే వరకు ఆయన ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల ద్వారా మీ అందరితో కనెక్ట్ అవుతారు. ప్రజల కోసం తన వాయిస్ ను ఎప్పుడూ బలంగానే వినిపిస్తారు. వారి కోసం పోరాడుతారు. జైహింద్ అని '' ఇండియన్ నేషన్ కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది.

-ట్విట్టర్ బ్లాక్ చేయడానికి అసలు కారణం ఇదీ..
ఈ వారం ప్రారంభంలో రాహుల్ గాంధీ దళిత కుటుంబంలోని కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆ ఫొటోను ట్వీట్ చేశారు.దీనిపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయగా మరుసటి రోజు ట్విట్టర్ ఈ ట్వీట్ ను తీసివేసింది. తాజాగా నేడు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ను సస్పెండ్ చేసింది.

ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అతడి ట్వీట్లు, కామెంట్లకు విశేష స్పందన వస్తోంది. తాజాగా ట్విట్టర్ ఈ రాహుల్ ఖాతా సస్పెండ్ చేయడంతో ఆయనకు వాయిస్ లేకుండా పోయింది.