Begin typing your search above and press return to search.

జల్లికట్టులో మెరిసిన రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:48 PM IST
జల్లికట్టులో మెరిసిన రాహుల్ గాంధీ
X
తమిళనాడులో పొంగల్ (సంక్రాంతి) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఇక అక్కడ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా ‘జల్లికట్టు’ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఎన్ని పోలీస్ ఆంక్షలున్నా సరే వారి సంస్కృతి సంప్రదాయాలను మాత్రం మరవరు.

ఇక భారత్ లోనే దక్షిణ తమిళనాడులోని మధురై జిల్లాలో నేటి నుంచి సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే మధురైలో జరుగుతున్న జల్లికట్టు పోటీలకు అనుకోని ముఖ్య అతిథి వచ్చారు. అతనెవరో కాదు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..

తాజాగా మధురై జల్లికట్టు వేడుకలకు రాహుల్ గాంధీ.. డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధితో కలిసి హాజరయ్యారు. సంప్రదాయ క్రీడ జల్లికట్టు ను వీక్షించారు.

ఈ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆవేశంతో దూసుకొస్తున్న ఎద్దులను కట్టడి చేశారు. దాదాపు 200 ఎడ్లను పోటీల్లో వినియోగిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో 150 కంటే తక్కువ మంది మంచి ఆటగాళ్లు జల్లికట్టులో పాల్గొంటున్నారు. అలాగే 50శాతం జనాన్నే పోటీలు చూసేందుకు అనుమతిస్తున్నారు. ఇక ప్లేయర్లు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాకే వారిని ఆటకు అనుమతించారు.