Begin typing your search above and press return to search.
ఈ వీడియో చూసిన తర్వాత ‘పప్పు’ అనేందుకు అస్సలు ఇష్టపడరు
By: Tupaki Desk | 25 April 2021 9:29 AM ISTనిజమా? అబద్ధమా? అన్నది పట్టించుకోకుండా కొన్ని మాటలు నిజాలుగా.. అవే వాస్తవాలుగా చలామణి అవుతుంటాయి. వారి మీద తెలివిగా వేసే ముద్రలు.. జాతి జనుల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. రాహుల్ గాంధీ అన్నంతనే అతడో పప్పుగా.. అతడికి ఏమీ తెలియదని.. బంగారు స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినోడిగా.. అతడి అరచేతిలో అధికారం ఎందుకు ఉండాలన్న ప్రశ్న మాత్రమే కాదు.. గాంధీ కుటుంబాల మీద వ్యూహాత్మకంగా జొప్పించిన వ్యతిరేకత దేశానికి ఎంత నష్టమన్న విషయం ఇటీవల కాలంలో అర్థమవుతూ ఉంటుంది.
రాహుల్ పై వేసిన పప్పు ముద్ర ఎంత తప్పన్న విషయం ఇటీవల కాలంలో అతడు చేసిన సాహసాలు.. అతడి మాటలు విన్నప్పుడు.. సమర్థుడ్ని.. చేతకాని వ్యక్తిగా అనుకున్న దేశ ప్రజలు ఎంత తప్పు చేశారన్న భావన కొందరికి కలుగుతుంది. నడి సముద్రంలో ఈత కొట్టటానికి.. అందునా రాహుల్ గాంధీ లాంటి స్థాయి ఉన్న నేతకు ఎన్ని గుండెలు ఉంటే అలా చేయగలుగుతారు? అంతేనా? అలాంటి ఎన్నో సాహసాలు చూసినప్పుడు.. సినిమాల్లో చూసే రీల్ మనిషి రియల్ గా కనిపించటం కాసింత థ్రిల్ అయ్యే పరిస్థితి.
ఇంతటి సామర్థ్యం ఉన్న వ్యక్తిని దేశ ప్రజలు కానీ.. మీడియా కానీ ఎందుకు గుర్తించలేకపోయిందన్న ప్రశ్న మదిలో మెదలక మానదు. దానికి ఎవరికి వారే నిందించుకోవాలి. ఎవరిలో ఎలాంటి సమర్థత ఉందన్న విషయాన్ని గుర్తించాల్సింది ప్రజలు మాత్రమే. నేను ఇంత తోపు అని ఎవరికి వారు చెప్పుకోలేరు కదా? కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తున్న వేళ.. ఇటీవల ఒక ఎన్నికల సభలో రాహుల్ చేసిన ప్రసంగానికి సంబంధించిన ఒక క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.
గతంలో అతడి మాటల్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోని వారు.. ఇప్పుడు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితుల్లో.. ఇంత సెన్సిబుల్ గా మాట్లాడే వ్యక్తిని మనం ఎందుకు గుర్తించలేకపోయామన్న సందేహం ఎవరికి వారికి కలుగక మానదు. ఇంతకీ ఆ వీడియోలో రాహుల్ ఏం చెప్పారన్నది చూస్తే.. ఏడాది క్రితమే కరోనా తీవ్రత గురించి తాము హెచ్చరించామని.. అప్పుడు తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పారు.
కరోనా కఠినమైన సవాళ్లను విసురుతుందని.. దేశ ప్రజల మీదా.. వారి ఆర్థిక పరిస్థితి మీద మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీస్తుందని చెబితే ప్రధాని మోడీ పట్టించుకోలేదన్నారు. కరోనాను అరికట్టేందుకు చర్యలు చేపట్టమని చెబితే.. జాతి మొత్తం పళ్లాలు మోగించాలని.. గంట కొట్టాలని.. మొబైల్ లో దీపాల్ని వెలిగించాలంటూ పిలుపునిచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. రాహుల్ మాటల్ని విన్నప్పుడు మోడీ ఏం చెబితే ఆ పనిని యావత్ దేశం చేసింది.. అది కూడా ఎలాంటి లాజిక్ ఆలోచించకుండానే.
కరోనాను తరిమికొట్టేందుకు ప్రధాని మోడీ చెప్పిన మాటలకు..తాజాగా నెలకొన్న పరిస్థితికి పొంతన లేని పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో శవాలు గుట్టలుగా మారిన పరిస్థితన్న విషయాన్ని గుర్తు చేయటమే కాదు.. మోడీ.. మోడీ అని అతని మాటల్ని పదే పదే మీడియా చూపిస్తుందని ఎద్దేవా చేశారు. అందరు అనుకున్నట్లుగా ప్రధాని మోడీ దేశ ప్రజల కోసం కాదు.. తనకు మిత్రులైన ఇద్దరు.. ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం పని చేస్తారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వీడియోను అసాంతం చూసిన వారెవరు కూడా.. రాహుల్ ను పప్పు అనటానికి మించిన తప్పు మరొకటి ఉండదనుకోవటం ఖాయం.