Begin typing your search above and press return to search.

మోడీ మాటలన్నీ అపద్దాలే..నిజాలు బయటపెట్టిన రాహుల్!

By:  Tupaki Desk   |   26 Dec 2019 4:52 PM IST
మోడీ మాటలన్నీ అపద్దాలే..నిజాలు బయటపెట్టిన రాహుల్!
X
దేశంలో ఎక్కడా నిర్బంధ కేంద్రాలు లేవంటూ ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ‘‘ఆరెస్సెస్‌ కు చెందిన ప్రధాని భారతమాతకే అబద్ధాలు చెబుతున్నారు’’ అంటూ మోదీపై రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు ట్విటర్‌ లో సందేశం ఉంచిన ఆయన ఓ వీడియోను కూడా ట్యాగ్‌ చేశారు. అసోంలో నిర్మాణంలో ఉన్నట్లుగా చెబుతున్న ఓ నిర్బంధ కేంద్రం దశ్యాలతో పాటు ఇటీవలి దిల్లీ సభలో మోదీ విపక్షాలపై చేసిన విమర్శలకు సంబంధించిన దశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

దిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో ఆదివారం భాజపా భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో పాల్గొన్న మోదీ పౌరసత్వ సవరణ చట్టం - జాతీయ పౌర పట్టికపై విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్‌ ఆర్‌ సీ జాబితాలో చోటు దక్కని ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు పంపుతారంటూ విపక్షాలు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని మోదీ ఆరోపణలు చేశారు. దేశంలో అసలు నిర్బంధ కేంద్రాలే లేవని ఆయన చెప్పుకొచ్చారు.

కాగా మతియా నిర్బంధ కేంద్రం దాదాపు పూర్తికావచ్చిందని ఆ కేంద్రాన్ని సందర్శించిన ఓ జాతీయ టీవీ చానెల్‌ పేర్కొనడం విశేషం. 3000 మంది డిటెయినర్లను ఇక్కడ నిలిపి ఉంచే సామర్ధ్యం కలిగిన ఈ సెంటర్‌ నిర్మాణానికి రూ 46 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అసోం రాజధాని గువహటికి ఈ కేంద్రం 129 కిమీ దూరంలో ఉంది. 28,800 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులతో కూడిన 15 భవనాలను నిర్మిస్తుండగా వీటిలో 13 భవనాలను పురుషులకు, 2 భవనాలను మహిళలకు కేటాయించనున్నారు.