దీనికి మోడీనే సమాధానం చెప్పాలి!

Tue Feb 07 2023 22:19:55 GMT+0530 (India Standard Time)

rahul gandhi questions surge in adani fortunes under modi govt

ఔను.. కొన్ని కొన్ని ప్రశ్నలకు ప్రధాని మోడీనే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు నెటిజ న్లు. ఎందుకంటే.. గుజరాత్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకున్న అదానీ.. గ్రూప్ అధినేత గౌతం అదానీ ఆదాయం వ్యవహారం.. తాజాగా పార్లమెంటును మరోసారి కుదిపేసిం ది. 2014లో అంటే.. అప్పటికి మోడీ అధికారంలోకి రాలేదు. అప్పుడు అదానీ ఆదాయం.. కేవలం 8 మిలియన్ డాలర్లు.. అంటే.. భారత కరెన్సీలో 80 లక్షల డాలర్లు(సుమారు 64 కోట్లు).



మరి 2022 నాటికి అదే అదానీ ఆదాయం ఏకంగా అధికారిక లెక్కల ప్రకారం 140 మిలియన్ డాలర్లకు చేరిం ది. అంటే.. మన కరెన్సీ ప్రకారం.. కోటీ 40 లక్షల డాలర్లకు చేరింది. మరి ఇంత తక్కువ సమయంలో ఎలా ఇంత పెరిగిందనేది ప్రశ్న. పైగా కరోనా సమయంలో ఇతరుల ఆదాయాలు తగ్గిపోగా.. ఇప్పుడు మాత్రం .. వీరి ఆదాయం ఎలా పెరిగిందనేది పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు సంధించిన ప్రశ్న.

తాజాగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశం మొత్తం అదానీ గురించే మాట్లాడుతోందని..  మోడీ-అదానీ మధ్య సంబంధమేంటో తెలియాల్సి ఉందన్నారు. 2014లో 8 మిలియన్ డాలర్లు ఉన్న అదానీ ఆదాయం.. 2022లో 140 మిలియన్ డాలర్లుకు ఎలా చేరుకుందని ప్రశ్నించారు.  దేశీయ విమానాశ్రయాల్లో అదానీ వాటా పెరుగుతోందని.. కాంట్రాక్టులన్నీ అదానీకి అప్పగించడమేనా భారత్ పాలసీ అని ప్రశ్నించారు.

దేశంలోనే ఎక్కువ ఆదాయం కలిగిన ముంబయి విమానాశ్రయాన్ని జీవీకే సంస్థ నుంచి లాక్కుని .. ప్రభుత్వ మే అదానీకి అప్పగించిందన్నారు.  2014లో మోడీ అధికారంలోకి వచ్చాక మేజిక్ జరిగి.. అదానీకి జాక్పాట్ తగిలిందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రపంచ కుబేరుల జాబితాలో 609వ స్థానంలో ఉన్న అదానీ.. రెండో స్థానానికి చేరుకున్నారని చెప్పారు. మరి దీనికి మోడీ ఏం చెబుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.