Begin typing your search above and press return to search.
రాహుల్ - ప్రియాంకలు పెట్రోల్ బాంబులు
By: Tupaki Desk | 25 Dec 2019 12:55 PM ISTకాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ - ప్రియాంక వాద్రాలు పెట్రోల్ బాంబు లాంటి వారని హ్యారానా హోంమంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ - ప్రియాంకలు ప్రాణాలతో ఉన్న పెట్రోల్ బాంబు లాంటి వాళ్లని.. వారు అడుగుపెట్టిన చోట అగ్గి రాజేసి - ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమవుతారని ట్వీట్ చేశారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఒకే రోజు ఐదుగురు మరణించారు. వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన రాహుల్ - ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ ఉన్న దృష్ట్యా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకోవడం దుమారం రేపిన సంగతి తెలిసిందే..
ఇలా వారిని అడ్డుకోకపోతే ఈ ఇద్దరు అల్లకల్లోలం సృష్టించేవారని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్, ప్రియాంకలు అక్కడ అడుపెడితే అగ్గి రాజేసేవారని నోరు జారారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.