Begin typing your search above and press return to search.

రాహుల్ అనవసరంగా భయపడ్డాడా?

By:  Tupaki Desk   |   27 Oct 2019 7:00 AM IST
రాహుల్ అనవసరంగా భయపడ్డాడా?
X
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు భయపడటం ఏమో కానీ - ఆ పార్టీకి జాతీయాధ్యక్షుడిగా ఉండిన రాహుల్ గాంధీ మాత్రం చాలా భయపడ్డాడు. ఏకంగా పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి వెళ్లిపోయాడు. గత ఐదు నెలల్లో రాహుల్ గాంధీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే పనులు ఏవీ చేయలేదు.

విహారయాత్రలు - విదేశీ యాత్రలు చేస్తూ సేదతీరుతూ ఉన్నాడు. ఒక జాతీయ పార్టీ అధినాయకత్వ హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పనులు కావు అవి. అయితే రాహుల్ మాత్రం లేదు.

రాహుల్ అలాంటి వైరాగ్యాన్ని చూపేసరికి విశ్లేషకులు - పరిశీలకులు కూడా కాంగ్రెస్ ను సీరియస్ గా తీసుకోవడం మానేశారు. హర్యానా - మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభావం ఉండదనే అనుకున్నారు. దానికంతా కారణం రాహుల్ గాంధీ తారు మాత్రమే! ఒకవేళ రాహుల్ యాక్టివ్ గా పని చేసి ఉంటే.. కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో అందరూ మరింత సీరియస్ గా తీసుకునే వాళ్లే. అయితే రాహుల్ మాత్రం తీరు మార్చుకోలేదు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి గట్టి సందేహం ఇచ్చారు. జాగ్రత్తగా పని చేసుకుంటే తాము ఆదరిస్తామని వారు రాహుల్ కు కూడా భరోసా ఇచ్చారు. వైరాగ్యాన్ని వదిలి పార్టీని బలోపేతం చేసుకోవాలని మహారాష్ట్ర, హర్యానా ప్రజలు తమ ఓట్లతో సూచించారు.

ఎంపీగా సొంత నియోజకవర్గంలో ఓడిపోయి భయపడిపోయిన రాహుల్ కు ప్రజలు ఈ ఎన్నికలతో భరోసాను ఇచ్చారు. పని చేసుకోమని పురమాయించారు!