Begin typing your search above and press return to search.
రాజకీయాల్లో సీరియస్ లేని రాహుల్.. ఈ వార్తతో స్పష్టం
By: Tupaki Desk | 28 Dec 2020 12:45 PM ISTనడిపించే నాయకుడంటే ఎలా ఉండాలి.. అన్నీ తన భూజాన వేసుకోవాలి. అందరికంటే ముందే తనే ఉండాలి. క్లిష్ట సమయంలో పార్టీకి అండగా నిలవాలి. పోరాటంలో ముందుండాలి. సహజంగా పార్టీ అధ్యక్షుడైనా ఒక సమూహానికి నాయకుడైనా ఇలానే వ్యవహరిస్తాడు. కానీ మన ఘనత వహించిన రాహుల్ గాంధీ మాత్రం అందరిలోకి డిఫెరెంట్. ఆయన బాధ్యత తీసుకోడు. క్లిష్ట సమయంలో కాడి వదిలేసి పారిపోతాడనే విమర్శలు ఉన్నాయి.
మొన్నటి బీహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓవైపు బీహార్ లో ఈసారి గెలుపు గ్యారెంటీ అనుకొని ఆర్జేడీ అధినేత తేజస్వి పోరాడుతుంటే మితపక్షం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి హిమాచల్ ప్రదేశ్ లో శీతాకాలం సెలవులు ఎంజాయ్ చేశాడనే అపవాదు మూటగట్టుకున్నాడు.బీహార్ ప్రచారం వేళ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను లీడ్ చేయకుండా రాహుల్ గాంధీ పారిపోయాడని ప్రత్యర్థులు విమర్శించారు. రాహుల్ లేకపోవడం వల్లే ఓడిపోయామని తేజస్వి యాదవ్ లాంటి వారు విమర్శించారు. కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా రాహుల్ గాంధీ ఏటో వెళ్లిపోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
తాజాగా దేశంలో రైతుల ఆందోళన ఓవైపు ఉంది. మరో వైపు కాంగ్రెస్ ప్రక్షాళన దిశగా సాగుతోంది. వృద్ధ జంబూకాలను ఇంటికి పంపి పార్టీకి యువరక్తం నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ సహా పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను మార్చి కాంగ్రెస్ ను బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ను చేయబోతున్నారని.. ఈ మేరకు ఎన్నిక నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇంతటి క్లిష్ట సమయంలో రాహుల్ గాంధీ దేశం నుంచి ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది.
రాహుల్ గాంధీ ఆదివారం వ్యక్తిగత పనిమీద అంటూ ఇటలీ వెళ్లిపోయారని తెలిసింది. ఆయన ఎక్కడికి వెళ్లిపోయింది పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా సైతం అధికారికంగా చెప్పకపోవడంపై అందరూ ముక్కున వేలేసుకున్నారు.
అయితే రాహుల్ గాంధీ ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో మిలన్ నగరానికి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడ రాహుల్ అమ్మమ్మ ఉన్నారని.. ఆమెను కలిసి రాహుల్ కొద్దిరోజుల్లోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఓ వైపు దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన.. మరోవైపు కాంగ్రెస్ ప్రక్షాళన వేళ ఇలా రాహుల్ బాధ్యత మరిచి టూర్ కు వెళ్లడం కాంగ్రెస్ వర్గాలనే కాదు ఇతర రాజకీయ పార్టీలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాహుల్ లో సీరియస్ నెస్ లేదని.. ఆయన అధ్యక్షుడిగా పనికిరాడన్న వాదన తెరపైకి వస్తోంది.