Begin typing your search above and press return to search.
రాహుల్ శ్రీనగర్ పర్యటనలో అతి పెద్ద ట్విస్ట్
By: Tupaki Desk | 25 Aug 2019 5:09 PM ISTకశ్మీర్ విషయంలో మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయాల నేపథ్యంలో.. కాంగ్రెస్ అండ్ కోకు చెందిన పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయితే.. మోడీ వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతున్న కాంగ్రెస్ పై పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ తో పాటు మరికొందరు విపక్ష నేతలు శ్రీనగర్ లో పరిస్థితిని చూసేందుకు స్వయంగా ఢిల్లీ నుంచి బయలుదేరారు. వారు.. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ చేరినంతనే వారిని.. సిటీలోకి అనుమతించకుండానే వెనక్కి పంపేశారు.
దీంతో.. వారికేం చేయాలో తోచని పరిస్థితి. శ్రీనగర్ వరకూ వచ్చి కూడా ఏమీ చేయలేకపోతున్నామన్న భావనతో వెనుదిరిగారు. శ్రీనగర్ లో పర్యటించటం ద్వారా.. అక్కడి స్థానికుల అగ్రహాన్ని బయట ప్రపంచానికి చూపించటం ద్వారా మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలని భావించారు. అయితే.. శ్రీనగర్ విమానాశ్రయం నుంచి నగరంలోకి అనుమతించకపోవటంతో వారేం చేయలేని పరిస్థితి. ఇలాంటివేళ.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
వాస్తవానికి ఇలా జరుగుతుందని మోడీ అండ్ కో కూడా ఊహించి ఉండరనే చెప్పాలి. ఒకవేళ ఇలాంటివి జరుగుతాయన్న ఆలోచన ఉంటే.. వారిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపేలా మోడీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసేదేమో? ఇంతకీ జరిగిందేమంటే.. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తున్న వేళ.. విమానంలోని కిటికీ సీటు వద్ద కూర్చున్న రాహుల్ వద్దకు ఒక మహిళ హటాత్తుగా వచ్చారు.
రాహుల్ వద్దకు వచ్చిన వెంటనే ఆమె పెద్ద ఎత్తున ఏడవటం మొదలెట్టారు. దీంతో.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాధికా ఖేరా తన మొబైల్ తో వీడియో తీయటం షురూ చేశారు. కశ్మీర్ లో తాము ఎదుర్కొంటున్న కష్టాల్ని ఏకరువు పెట్టుకొచ్చింది సదరు మహిళ. తమ పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నారని.. తన సోదరుడు హృద్రోగి అని.. గడిచిన పది రోజులుగా ఇంటి నుంచి ఆసుపత్రికి కూడా వెళ్లలేకపోతున్నట్లుగా వాపోయింది తామెన్నో కష్టాల్ని ఎదుర్కొంటున్నట్లుగా వాపోయింది.
తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న మహిళను తన సీటు నుంచి లేచి మరీ ఓదార్చారు రాహుల్. ఈ మొత్తం ఎపిసోడ్ కు చెందిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ నేత. మొత్తానికి రాహుల్ శ్రీనగర్ పర్యటనలో ఏం తెలుసుకోవాలనుకున్నారో.. ఆ విషయాన్ని తన రిటర్న్ జర్నీలో.. ఫ్లైట్ లో తెలుసుకోవటమే కాదు.. ప్రపంచానికి కూడా తెలిసేలా చేశారని చెప్పాలి. ఈ ట్విస్ట్ ను మోడీ ఊహించి ఉండరు. లేదంటే.. మరో ప్రయత్నం చేసి ఉండేవారేమో?