Begin typing your search above and press return to search.
ప్రియాంక కోసం రాహుల్ ను ఎంత తిట్టారంటే?
By: Tupaki Desk | 26 Oct 2015 9:30 AM ISTరాజకీయాలు అంతే.. ప్రాధామ్యాలు మారుతున్న కొద్దీ.. పార్టీ నేతల స్వరాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంటుంది. 2014 సార్వత్రిక ఎన్నిక సమయం నాటికి యువరాజు రాహుల్ కు మించిన నేత మరొకరు లేరన్నట్లుగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించే వారు. ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? లేవా అన్న అంశంపై పెదవి విప్పటానికి కూడా ఇష్టపడే వారు కాదు.
కానీ.. ఎన్నికల ఫలితాలు వెలువడి.. కాంగ్రెస్ ఘోర ఓటమిని మూటగట్టుకున్న తర్వాత కానీ రాహుల్ శక్తిసామర్థ్యాల మీద ప్రశ్నలు వేయటానికి.. సందేహాలు వ్యక్తం చేయటానికి కాంగ్రెస్ నేతలకు ధైర్యం చిక్కింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన పదహారు నెలల తర్వాత.. ఉన్నట్లుండి కాంగ్రెస్ సీనియర్ నేతలు సరికొత్త మెలో డ్రామాను తెరపైకి తీసుకొచ్చారు.
ఈ మధ్యనే కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు.. అప్పట్లో ఇందిర తన రాజకీయ వారసురాలిగా ప్రియాంకగాంధీనేనని చెప్పేవారని ఆయన వెల్లడించారు. ఇందిరమ్మ చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత ఆమె ఆకాంక్ష తెర మీదకు రావటం ఏమిటి? ఇన్నాళ్లు ఆ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదు. ఇందిర ఆకాంక్షను వెల్లడించటానికి తగిన సమయం రాలేదా అంటే.. ఇందిర తర్వాత రాజీవ్.. రాజీవ్ మరణం తర్వాత దిక్కుతోచని పరిస్థితుల్లో పీవీని ప్రధానిని చేయటం.. ఆ తర్వాత పార్టీ అధికారాన్ని కోల్పోవటం.. సంక్షోభాన్ని ఎదుర్కోవటం లాంటివెన్నో జరిగాయి. కానీ.. ఎప్పుడూ కూడా ప్రియాంకమ్మ గురించి ఇందిరమ్మ ఏమన్నారన్న విషయాన్ని తెర మీదకు తీసుకురాలేదు.
కానీ.. ఇప్పుడు ఉన్నట్లుండి ఇందిరమ్మ ఆలోచనను తెర మీదకు తీసుకురావటంలో విజయవంతం అయ్యారని చెప్పాలి. ఇందిరమ్మ ఆకాంక్షను వ్యక్తం చేసిన నేతకు తగ్గట్లుగా.. తాజాగా మరో సీనియర్ నేత తన గళం విప్పారు. రాహుల్ ను చేతకాని వాడిలా.. సామర్థ్యం లేని వ్యక్తిగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కు పార్టీ పగ్గాలు ఇవ్వటానికి పార్టీలో చాలామంది ఒప్పుకోవటం లేదని.. పార్టీ అధ్యక్ష పదవి కాకుండా ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా రాహుల్ సరైన వ్యక్తికాదన్న తన వాదనను వినిపించేందుకు మరో సీనియర్ నేత పుస్తకం ద్వారా సిద్ధమవుతున్నారు. ఇంతకీ.. ఆ సీనియర్ నేత ఎవరో కాదు.. ఎం.ఎల్. ఫోతేదార్. సోనియమ్మకు అత్యంత విధేయుడైన ఆయన.. సోనియమ్మ శక్తి సామర్థ్యాల్ని పొగిడేసి.. రాహుల్ పై సందేహాలు వ్యక్తం చేసిన ఆయన.. పార్టీ భవిష్యత్తు ఆశాకిరణంగా ప్రియాంక గాంధీ అన్న విషయాన్ని చెబుతున్నారు.
తాజాగా ఆయన రచించిన ‘‘ద చినార్ లీవ్స్’’ పుస్తకం ద్వారా తన తాజా వాదనను తెరపైకి తీసుకురానున్నారు. పుస్తకం ఆవిష్కరణకు ముందే.. రాహుల్ పై సంచలన వ్యాఖ్యలు చేయటం ద్వారా మీడియాను ఆకర్షించిన ఫోతేదార్.. ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకూ తమ్ముడ్ని కింగ్ అన్న వారు.. ఇప్పుడు తమ్ముడు బొంగు అన్నట్లుగా మాట్లాడటం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంట్లో పిల్లలతో గడుపుతూ.. అప్పుడప్పుడు తమ్ముడికి సలహాలిచ్చే ప్రియాంకే తమ అసలుసిసలు అధినేత్రిగా భావిస్తున్న క్రమంలో ఆమెను సీన్లోకి తేవటానికి కాంగ్రెస్ సీనియర్ల గణం చాలానే శ్రమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకరు హీరో కావాలంటే.. మరొకరు జీరో అవ్వాల్సిందే కదా. కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్నది కూడా అచ్చంగా అదే.