Begin typing your search above and press return to search.

ఐదో తరగతి పిల్లలకు రాహుల్ వ్యాసం

By:  Tupaki Desk   |   28 Feb 2016 10:31 AM IST
ఐదో తరగతి పిల్లలకు రాహుల్ వ్యాసం
X
ఈ దేశానికి ప్రధానమంత్రిని కావాలని కలలు కనే నేతల్లో రాహుల్ గాంధీ ఒకరు. గత సార్వత్రిక ఎన్నికల్లో అప్రకటితంగా రాహుప్రల్ ను కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకోవటం తెలిసిందే. ఒక ఎంపీగా ఆయన పీకింది ఏమిటన్నది కూడా ఎవరూ చటుక్కున చెప్పలేరు. అంతదాకా ఎందుకు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ నియోజకవర్గానికి ఆయనేం చేశారన్నది కోటిరూకల ప్రశ్నే. దేశం ఎదుర్కొంటున్న ఏ సమస్య మీదా ఆయన ఇప్పటివరకూ పని చేసింది లేదు. ఎంపీగా తర్వాత.. కనీసం కాంగ్రెస్ పార్టీకి లబ్థి చేకూరేలా ఏమైనా చేశారా? అన్న ప్రశ్న వేసుకుంటే వెనువెంటనే సమాధానం రాదు.

అలాంటి రాహుల్ గాంధీ మీద ఐదో తరగతి సీబీఎస్ ఇంగ్లిష్ గైడ్ లో ఒక వ్యాసం ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో స్ఫూర్తివంతమైన రాజకీయ నేతలే లేనట్లుగా రాహుల్ మీద వ్యాసం ప్రచురించటంలో ఔనత్యం ఏమిటో అధికారులే చెప్పాలి. ఇక.. ఈ వ్యాసం విషయానికి వస్తే.. ప్రభావవంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టిన రాహుల్ తన సోదరి ప్రియాంక మాదిరే ప్రజా జీవితాన్ని సహజంగా గడుపుతున్నట్లుగా పేర్కొన్నారు. ఉత్సాహవంతమైన రాజకీయవేత్తగా కీర్తించటంతో పాటు.. అమెరికా.. బ్రిటన్ దేశాల్లో రాహుల్ ఎక్కువ కాలం గడిపారని.. ప్రస్తుతం కాంగ్రెస్ యువ నాయకుల భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తున్నారని ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

ఇన్నాళ్లు నెహ్రు.. ఇందిరల గురించి పాఠాలు చదువుకున్న చిన్నారులు.. ఇప్పుడు రాహుల్ గురించి పాఠాలు చదువుకోవాల్సి వస్తోంది. పిల్లలు చదువుకునే పాఠాలుగా మారటానికి గాంధీ ఫ్యామిలీలో పుట్టటమే అర్హతా..?