Begin typing your search above and press return to search.

అందుకే సామీ...! నిన్ను పప్పు అన్నారు

By:  Tupaki Desk   |   1 March 2018 10:21 PM IST
అందుకే సామీ...! నిన్ను పప్పు అన్నారు
X
రాహుల్ గాంధీని ఇంట్లో ఏం ముద్దు పేరుతో పిలుస్తారో కానీ దేశం మాత్రం ఆయనకు పప్పు అన్న ముద్దు పేరు ఖరారు చేసింది. ఆయన తీరు కూడా దానికి తగ్గట్లుగానే ఉంటోందంటున్నారు ఆయన విమర్శకులు. ఇటీవల కొంత పరిణతి కనిపించినా మళ్లీ పప్పు మార్కు ప్రకటనలు - కామెంట్లు చేస్తున్నారట ఆయన. అందుకు తాజా ఉదాహరణ.. దేశంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన వ్యాఖ్యలే. మొన్న మధ్యప్రదేశ్ - ఒడిశాల్లో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన తరువాత అందులో రెండు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా బీజేడీ ఒక స్థానంలో గెలిచింది. బీజేపీ ఒక్క చోట కూడా గెలవలేదు. దాంతో రాహుల్.. ఈ ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీ పతనం మొదలైనట్లేనని అన్నారు. అయితే.. ఆ అసెంబ్లీ నియోజకవర్గాల నేపథ్యం తెలిసినవారంతా రాహుల్ గాంధీది పిచ్చితనమంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ మూడింట్లో ఏ ఒక్క సీటును గెల‌వ‌క‌పోవ‌డం.. ఆ పార్టీ నేత‌ల‌కు చెంప‌పెట్ట‌న్నారు. దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, 2019 ఎన్నిక‌ల్లో మోడీ స‌ర్కార్ ప‌త‌నం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాలను పరిశీలిస్తే రాహుల్ వ్యాఖ్యలపై ఎవరైనా నవ్వాల్సిందే. బీజేపీ పతనం మాట అటుంచితే కాంగ్రెస్ బలం మరింత తగ్గిందని అర్థమవుతోంది.

ఉప ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ లో రెండు - ఒడిశాలో ఒక స్థానానికి పోలింగ్ నిర్వహించారు. అందులో మధ్య ప్రదేశ్‌ లో రెండు స్థానాలు ముంగౌలీ - కొలారస్‌ లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒడిశాలోని బీజేపూర్ స్థానంలో బిజూ జనతా దళ్ గెలిచింది.

వీటిలో ముంగోలీ - కొలారస్ రెండు స్థానాలూ కాంగ్రెస్ సిటింగ్ స్థానాలే. పైగా.. ఇంతకుముందు 2013లో ఇక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. కానీ, ఇప్పుడు.... మోజారిటీ దారుణంగా తగ్గిపోయింది. ముంగోలీలో 2013లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 21 వేల ఓట్ల మెజారిటీ సాధించింది. ఇప్పుడు ఉప ఎన్నికలో అతి కష్టం మీద 2,124 ఓట్ల తేడాతో గెలిచింది. కొలారస్ లోనూ అంతే.... 2013లో ఇక్కడ కాంగ్రెస్‌కు ఏకంగా 25 వేల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఉప ఎన్నికలో 8 వేల ఓట్ల తేడాతో గెలిచింది.

ఇక ఒడిశాలోని బీజేపూర్ స్థానం గురించి చెప్పుకొంటే కాంగ్రెస్‌ కు అంతో ఇంతో ఉన్న పరువు కూడా పోతుంది. ఇది కూడా 2014లో కాంగ్రెస్ గెలిచిన స్థానమే. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుబాల్ సాహూ అక్కడ అతి కష్టం మీద 458 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2017 ఆగస్టులో ఆయన మృతిచెందగా ఇప్పుడు ఉప ఎన్నిక జరిగింది. అంటే.. అది కాంగ్రెస్ సిటింగ్ స్థానం. కానీ.. ఈ ఉప ఎన్నికలో సుబాల్ సాహూ భార్య కాంగ్రెస్ ను వీడి బీజేడీలో చేరి పోటీచేశారు. ఆమె... 1,01,435 ఓట్లు సాధించగా - సమీప ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థిపై ఆమె ఏకంగా 41,539 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ సాధించింది కేవలం 10,153 ఓట్లు మాత్రమే.

భర్త మృతిచెందడంతో ఆమెపై ఉన్న సానుభూతి పనిచేయడం నిజమే . కానీ, గెలుపు సులభమైన అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె కాంగ్రెస్ ను వదిలేసి బిజూ జనతాదళ్ లో చేరిందంటే ఆ పార్టీ పట్ల నేతల్లో ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా మూడు స్థానాల్లోనూ పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందన్నట్లుగా రాహుల్ మాట్లాడడంతో అంతా ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.