Begin typing your search above and press return to search.
మోడీకి షాకిచ్చిన రాహుల్ గాంధీ
By: Tupaki Desk | 18 July 2016 5:21 PM ISTఅరుణాచల్ ప్రదేశ్ లో పాలనా పగ్గాలు చేపట్టాలన్న భారతీయ జనతా పార్టీ లక్ష్యం విఫలమైన సంగతి తెలిసిందే. అయితే సీఎం మార్పిడి - అధికార చేజిక్కించుకోవడంలో బీజేపీ వైఫల్యం వెనుక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైన శైలిలో పావులు కదపడం కారణమని చెప్తున్నారు. యువరాజు దెబ్బకు మోడీకి దిమ్మతిరిగింది అనేది కాంగ్రెస్ వర్గాల టాక్.
అరుణాచల్ ప్రదేశ్ లో అధికారం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ నుంచి విడిపోయిన రెబల్ ఎమ్మెల్యేల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చేసిన ఆఖరి ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి నబమ్ తుకీ చేత రాజీనామా చేయించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఎత్తుకు బీజేపీ చిత్తయింది. ఆయన్ను తొలగిస్తే, ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లోనే ఉంటారని పసిగట్టిన రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రాహుల్ స్వయంగా ఈటానగర్ కు రాకున్నా, ఢిల్లీ నుంచే రెబల్ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగించారు. తుకీని తొలగించి - వేరే నేతను సీఎంగా ఎన్నుకుంటే, తమకు ఎలాంటి అభ్యంతరాలూ ఉండవని వారు ప్రకటించడంతో, ఆ వెంటనే తుకీని రాజీనామా చేయాలని రాహుల్ స్వయంగా కోరినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం తుకీ రాజీనామా చేయగా, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా పెమా ఖండూ పేరు తెరపైకి వచ్చింది. సీఎంను మార్చడం ద్వారా అసమ్మతిని దారికి తెచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ - పగ్గాలు చేపట్టాలన్న బీజేపీ కోరికకూ చెక్ పెట్టింది. 45 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని చెబుతూ ఖండూ గవర్నర్ ను కలిశారు. ఖండూ సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మొత్తంగా రాహుల్ వ్యూహాత్మకంగా వ్యవహరించి మోడీకి షాక్ ఇచ్చారని అంటున్నారు.