Begin typing your search above and press return to search.
గుజరాత్ గర్జన : మోడీ కోటలో పాగా ....?
By: Tupaki Desk | 11 May 2022 9:00 PM ISTప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదమూడేళ్ళ పాటు పనిచేశారు. ఆ తరువాత దేశానికి ప్రధాని అయ్యారు. అంతకు ముందు ఆయన ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇక మోడీ బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నపుడు తెర వెనక పార్టీని పటిష్టం చేయడానికి అధికారంలోకి తెసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఆ విధంగా గుజరాత్ లో ఒక్కో ఇటుకా పేర్చి బలమైన కాషాయ కోటనే మోడీ కట్టారు.
1995 ఫస్ట్ టైమ్ బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. దాని వెనక మోడీ చాలా చురుకైన పాత్ర పోషించారు. నాడు బీజేపీ తరఫున మోడీకు గురుతుల్యుడైన సీఎం గా కేశూభాయ్ పటేల్ ఉన్నారు. అయితే ఆయన గట్టిగా ఏడాది కూడా పాలించకుండానే పార్టీలో గొడవల వల్ల గద్దె దిగారు. ఆయన తరువాత అదే బీజేపీ నుంచి సురేష్ మెహతా సీఎం అయ్యారు.
ఇక బీజేపీలో లుకలుకలు రావడంతో శంకర్ సింఘ్ వాఘెలా తిరుగుబాటు చేసి రాష్ట్రీయ జనతాదళ్ ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. ఆ తరువాత మోడీ ధీటైన వ్యూహాలతో 1998లో మళ్ళీ కేశూభాయి పటేల్ సీఎం అయ్యారు. ఈసారి ఆయన మూడున్నరేళ్ళు పనిచేశారు. ఆయన తరువాత 2002లో మోడీ తెర ముందుకు వచ్చి ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా కాకుండానే నేరుగా సీఎం అయిపోయారు. నాటి నుంచి మోడీ మూడు సార్లు సీఎం గా గుజరాత్ ని పాలించి పటిష్టం చేసుకుంటూ వచ్చారు.
ఇక 2014లో మోడీ గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసి దేశానికి ప్రధాని అయ్యారు. అయినా సరే తన కనుసన్నల్లోనే గుజరాత్ ని ఉంచారు. అక్కడ రాజకీయం అంతా మోడీ చెప్పినట్లే ఈ రోజుకూ సాగుతోంది. మోడీ ప్రధాని అయ్యాక 2017లో జరిగిన ఎన్నికల్లో కూడా గుజరాత్ లో బీజేపీ మళ్లీ గెలిచింది. ఇలా 1998 నుంచి 24 ఏళ్ళుగా బీజేపీ నిరాటంకంగా అధికారంలో కొనసాగుతోంది.
ఒక విధంగా మోడీ కంచు కోటగా ఉన్న గుజరాత్ ని కాంగ్రెస్ ఈసారి గెలుస్తామని అంటోంది. నిజానికి 2017 ఎన్నికల వేళలో కాంగ్రెస్ కి మంచి ఊపు కనిపించింది. చాలా మంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరి బలమిచ్చారు. అక్కడ బలమైన సామాజిక వర్గమైన పటేల్స్ నాడు బీజేపీ మీద గుర్రుగా ఉండి కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. అయినా సరే కాషాయం విజయం సాధించింది.
ఆ తరువాత కూడా కాంగ్రెస్ తన బలాన్ని ఉంచుకోలేకపోయింది. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేశారు. ఇపుడు ఒక విధంగా గుజరాత్ ఎన్నికలు కాంగ్రెస్ కి అగ్ని పరీక్ష అదే విధంగా పాతికేళ్లుగా బీజేపీని మోస్తున్న జనాలకు విసుగు పుడితే మాత్రం కాంగ్రెస్ మాత్రమే ఆల్టర్నేషన్.
ఈ ఒక్క లాజిక్ తోనే కాంగ్రెస్ గుజరాత్ ని గెలుస్తామని అంటోంది. తాజాగా గుజరాత్ లో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈసారి గుజరాత్ మాదే అని గర్జిస్తున్నారు. దేశాన్ని గుజరాత్ మోడల్ అంటూ పేదల భారత్ గా మార్చిన మోడీని అదే గుజరాత్ మోడల్ డొల్లతనం ఏంటో జనాల సాక్షిగా చూపించి గద్దె ఎక్కుతామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కి ఎంత బలం తగ్గినా బీజేపీ కి అక్కడ అదే సరైన ప్రత్యర్ధి, పైగా బీజేపీ మీద గుజరాత్ లో మోజు తగ్గుతున్న వేళ రాహుల్ కామెంట్స్ తేలికగా కొట్టిపారేయలేరు. రాహుల్ సుడిగాలి పర్యటనలకు జనాలు బాగానే హాజరు అవుతున్నారు. మరి రాహుల్ నిజంగా మోడీ కోటను బద్ధలు కొడతారా. అదే జరిగితే 2024 ఎన్నికల ముందే బీజేపీని కాంగ్రెస్ కేంద్రంలో ఓడించేసినట్లే. ఒక్క గుజరాత్ రిజల్ట్ చాలా జాతకాలను మారుస్తుంది. అందుకే గుజరాత్ ని కాంగ్రెస్ కరెక్ట్ గా టార్గెట్ చేసింది.