Begin typing your search above and press return to search.
హెలికాఫ్టర్ రిపేర్ చేసిన రాహుల్!
By: Tupaki Desk | 11 May 2019 3:18 PM ISTఅమూల్ బేబీ ఇమేజ్ తో వైరిపక్షం అదే పనిగా ఎటకారం చేసుకునే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్నిసార్లు తన టాలెంట్లను ప్రదర్శిస్తుంటారు. కాంగ్రెస్ వారసత్వ నాయకుడన్న ముద్ర ఆయనపై అభిమానం కంటే.. అనుమానమే ఎక్కువని చెప్పాలి. అయితే.. తన మాటలతో.. చేతలతో తాను భిన్నమైన నేతగా రాహుల్ అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు. తాజాగా అలాంటి టాలెంట్ ఒకటి ప్రదర్శించి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేశారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్.. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ఏమంటే.. తాను ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కు సాంకేతిక సమస్య ఎదురైన వేళ.. దానికి సీరియస్ గా రిపేర్ చేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నేల మీద పడుకొని హెలికాఫ్టర్ ను రిపేర్ చేస్తూ కనిపించిన రాహుల్ ఫోటోపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఆ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకోని రాహుల్.. టీం వర్క్ తో ఏమైనా సాధించగమని పేర్కొనటం గమనార్హం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కు సాంకేతిక సమస్య వచ్చింది. దాన్ని ఆయన సహాయకులు సరి చేసే ప్రయత్నం చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాహుల్.. నేల మీద పడుకొని ఆ సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. మంచి టీం వర్క్ ఉంటే.. అన్ని చేతులు కలిసి పని చేయటమే.. ఉనా పర్యటనలో మా హెలికాఫ్టర్ కు సాంకేతిక సమస్య ఎదురైంది. అందరం కలిసి దాన్ని త్వరగా సరి చేశాం. లక్కీగా ఎవరికీ ఏమీ కాలేదని పేర్కొన్నారు. తానో జాతీయ పార్టీ అధినేత అన్న విషయాన్ని పట్టించుకోకుండా సింఫుల్ గా వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.