Begin typing your search above and press return to search.
రాహుల్ జీ! ఏపీకి మీరిచ్చే వరం ఏంటి?
By: Tupaki Desk | 18 Dec 2017 9:52 AM ISTరాహుల్ కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. పార్లమెంటులో మోడీ సర్కారు మీద దాడిని బలోపేతం చేసుకోవడానికి యావత్తు ప్రతిపక్ష పార్టీల నాయకులకు, తమ పార్టీకి చెందిన అందరు ఎంపీలకు ప్రత్యేకంగా విందు కూడా ఏర్పాటు చేసి.. కూడగట్టుకున్నారు. మొత్తానికి నాయకుడిగా కొత్త పాత్రలోకి ఎంట్రీ ఇవ్వగానే బలగాల్ని సమీకరించుకోవడం అనే వ్యవహారంపై దృష్టి పెట్టడం బాగానే ఉంది. ఏఐసీసీ చీఫ్ గా కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా - దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్న వ్యక్తిగా ఆయన పాత్ర.. పార్లమెంటులో మోడీ మీద పోరాడడం మాత్రమేనా? రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం మీద కూడా శ్రద్ధ ఉంటుందా? అనేది ఇప్పుడు మీమాంస?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ ఏలుబడే సాగింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ అంతరించిపోయింది. మరి కీలక రాష్ట్రాల్లో ఒకటైన ఏపీ లాంటి చోట్ల పార్టీని కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ కొత్త నాయకుడు ఎలాంటి వరాలను ప్రకటించబోతున్నాడు? అనేది అందరూ ఎదురు చూసే అంశమే.
కాకపోతే.. ఏపీ కి ఏ వరాలు అందిస్తే తమ పార్టీకి జవసత్వాలు అందుతాయో రాహుల్ కుస్తీలు పట్టాల్సిన - కసరత్తు చేయాల్సిన అవసరం లేకుండానే కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని చీల్చిన సమయంలో కాంగ్రెస్ ఏపీకి కొన్ని కంటితుడుపు హామీలు ఇచ్చింది. అవన్నీ అంతో ఇంతో ఏపీకి మేలు చేసేవే. కాకపోతే.. ప్రజలు ఛీత్కరించారు గనుక.. కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు.. గత ప్రభుత్వం విభజన చట్టం సాక్షిగా ఇచ్చిన సకల హామీలను కూడా తుంగలో తొక్కేసింది. వాటన్నింటినీ కొత్త ప్రభుత్వం అమలు చేసేలా కేంద్రంలో కదలిక తేగలిగితే చాలు.. ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను కొంత ఆదరించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అందుకే రాహుల్ సిద్ధంగానే ఉన్నారా?
ఈ మేరకు విభజన హామీలు అమలయ్యేలా 184వ రూల్ కింద ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి.. చర్చ - ఓటింగ్ జరిపించాలని రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. మరి వారి కోరికను మన్నించి.. ఏపీ కోసం పోరాటాన్ని అధికారికంగా ప్రకటించగల తెగువ రాహుల్ కైనా ఉన్నదా లేదా అనేది చూడాలి. ఏపీ కోసం అన్నట్లుగా గొంతెత్తితే.. తెలంగాణలో తమకు దెబ్బ పడుతుందేమో.. అన్నట్లుగా రాహుల్ మళ్లీ డొంకతిరుగుడు మార్గాలను ఆశ్రయిస్తే గనుక.. ఈసారి కూడా రెండు రాష్ట్రాల్లోనూ దెబ్బతిని నష్టపోయే పరిస్థితి వస్తుంది. విభజన చట్టం హామీలను ఉన్నదున్నట్టుగా అమలు చేస్తే తెలంగాణకు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి గనుక.. ఉభయుల కోసం అన్నట్లుగా రాహుల్ ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని.. కేంద్రంపై పోరాటం ప్రకటిస్తారో లేదో చూడాలి.