Begin typing your search above and press return to search.

పీఠంపై రాహుల్‌...మొద‌టి స్పీచ్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   16 Dec 2017 3:01 PM IST
పీఠంపై రాహుల్‌...మొద‌టి స్పీచ్ అదుర్స్‌
X
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మొద‌టి స్పీచ్‌ లోనే అద‌ర‌గొట్టేశాడ‌ని అంటున్నారు.పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడుతూ రాజకీయాల్లో సత్యం - దయాగుణం లోపించాయన్నారు. రాజకీయాలంటే ప్రజల కోసమే - కానీ ప్రస్తుతం రాజకీయాలను ప్రజల కోసం వాడడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజల అభ్యున్నతికి రాజకీయాలను ఆసరా చేసుకోవడం లేదు, కానీ ప్రజలను అణగదొక్కేందుకు రాజకీయాలను వాడుతున్నారని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 21వ శతాబ్ధం వైపు తీసుకువెళ్లిందని, కానీ ప్రధాని మోడీ మాత్రం దేశాన్ని మళ్లీ మధ్యయుగంలోకి తీసుకువెళ్తున్నారని విమర్శించారు.

ఈ సంద‌ర్భంగా మోడీని ఉద్దేశిస్తూ ప‌రోక్షంగా ఆరోప‌ణ‌లు గుప్పించారు. `సామరస్యం లేకుండానే వ్యాపారం చేయాలన్న ఉద్దేశంలో ఓ వ్యక్తి ఉన్నారు. తన వ్యక్తిగత వైభవం కోసం అనుభవాన్ని - జ్ఞానాన్ని ఆయన పక్కనపెట్టారు` అని మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ విమర్శలు చేశారు. ``ఒకసారి మంటలు వ్యాపిస్తే - వాటిని అర్పడం అంత సలువు కాదు - బీజేపీకి అదే చెబుతున్నాం. దేశంలో బీజేపీ హింసను సృష్టించింది. ఇప్పుడు ఆ హింస దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతోంది` అని రాహుల్ అన్నారు. బీజేపీ చేస్తున్న దాష్టికాలను ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు - నేతలు మాత్రమే నిలువరించగలరని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ అంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని - ఇప్పుడు ఇక ఆ పార్టీ గ్రాండ్ ఓల్డ్ అండ్ యంగ్ పార్టీగా ఆవిర్భవిస్తుందని రాహుల్ అన్నారు. ద్వేషపూరితమైన రాజకీయాలకు వ్యతిరేకంగా తాము పోరాడుతామన్నారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ త‌న రాజ‌కీయ ప‌రిణ‌తిని సైతం క‌న‌బ‌ర్చారు. కాంగ్రెస్ అనేది ఒక ప్రాచీన ఆలోచన అని - కానీ బీజేపీ వాళ్లు తమకు తామే ప్రాచీనులమని అనుకుంటారని, కానీ ఇది వాస్తవం కాదు అని - భార‌త్‌ లో రెండు స్వభావాలు ఎప్పుడూ ఢీకొంటాయని - బీజేపీ సైనికులు స్వార్థం కోసం పోరాటం చేస్తుంటారని - కానీ తాము మాత్రం సమాజ సేవ కోసం పోరాడుతుంటామని రాహుల్ అన్నారు. బీజేపీ వారిని సోదర‌సోదరీమణులుగా భావిస్తామని - కానీ వారితో ఏకీభవించమని - వాళ్లు ప్రజల గొంతులను నొక్కుతున్నారని - కానీ తాము మాత్రం ప్రజలకు మాట్లాడే అవకాశం ఇస్తామని రాహుల్ అన్నారు. వినమ్ర పూర్వకంగా తాను పార్టీ చీఫ్‌ గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. మహామహులు నడిచిన మార్గంలోనే నడుస్తున్నాన్న ఉద్దేశంతో ముందుకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు.