Begin typing your search above and press return to search.
మోడీని మాస్ గా తిట్టొద్దన్న రాహుల్
By: Tupaki Desk | 20 Dec 2016 6:00 AM ISTరాజకీయాల్లో దయా.. దాక్షిణ్యాలు అస్సలు ఉండవు.ప్రత్యర్థిని దెబ్బ తీసేందుకు ఎంతకైనా తెగించే ధోరణి రాజకీయపార్టీల్లోకనిపిస్తుంది. ఏం చేసైనా సరే.. అంతిమంగా రాజకీయ ప్రయోజనం పొందటమే లక్ష్యమన్నట్లుగా రాజకీయీ పార్టీ అధినేతలు వ్యవహరిస్తుంటారు. కానీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఇప్పుడు అందుకు భిన్నంగా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల నేపథ్యంలో అన్నీ రాజకీయ పార్టీలు సభలు నిర్వహిస్తున్న వేళ.. రాహుల్ సైతం వరుస సభల్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ సర్కారు మీదా.. బీజేపీ మీదా ఆయన ఒంటికాలి మీద విరుచుకుపడుతున్నారు. కానీ.. ఉన్నట్లుండి ఏమైందో కానీ.. ఆయన మోడీని మాస్ గా తిట్టేందుకు నో చెప్పటమే కాదు.. పార్టీ నేతలు.. కార్యకర్తలు చేసే నినాదాల విషయంలోనూ సూచనలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
యూపీలో జరిగిన బహిరంగ సభకు హాజరైన రాహుల్.. సభికుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వేళ.. మోడీ ముర్దాబాద్ (నశించాలి) అంటూ పలువురు నినాదాలు చేశారు. దీనికి స్పందించిన రాహుల్.. ముర్దాబాద్ లాంటి నినాదాల జోలికి వెళ్లొద్దన్న ఆయన.. పార్టీ మీటింగ్ లలో ముర్దాబాద్ లాంటి పదాలకు తావు లేదన్న ఆయన.. మోడీ దేశ ప్రజలందరికి ప్రధాని అని.. ఆయనపై మనది రాజకీయంగా పోరాటం చేయాలని.. రాజకీయంగా ఓడించాలని వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న మోడీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన అవినీతి సమాచారం ఉందన్న ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా మోడీని మాస్ గా తిట్టొద్దంటూ పేర్కొనటం వెనుక కథేమిటన్నది ఇప్పుడ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/