Begin typing your search above and press return to search.
మోడీకి యువరాజు చాలానే ప్రశ్నలు వేస్తున్నారే
By: Tupaki Desk | 9 April 2016 11:20 AM ISTవిపక్షంలో ఉండే వారికి అధికారంలో లేమన్న బాధ తప్పించి.. అధికారపక్షంపై దాడి చేయటానికి బోలెడన్ని అవకాశాలు ఉంటాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు చేయలేని చాలా అంశాల్ని ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రశ్నించే వీలుంటుంది. యూపీఏ పాలన సాగిన పదేళ్లలో నిత్యవసర వస్తువుల ధరలు పెరగటమే తప్పించి తగ్గింది లేదు. నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించండి మహాప్రభూ అని వేడుకున్నా విన్నది లేదు. ఆ మాటకు వస్తే.. కాంగ్రెస్ యువరాజు రాహుల్ అయితే.. పార్లమెంటు సమావేశాల్లో కూడా పెద్దగా పాల్గొనేవారు కాదు. పవర్ పోయాక కాస్తంత కుదురుగా లోక్ సభలో కూర్చుంటున్నారు కానీ.. అధికారంలో ఉన్నప్పుడు ఆయన మహా బిజీబిజీగా ఉండేవారు.
చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏమీ చేయని రాహుల్.. ఇప్పుడు మాత్రం ప్రధాని మోడీ ఏమీ చేయటం లేదంటూ మండిపడుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఎన్నికల సమయంలో మోడీ ఇచ్చిన హామీలేవీ ఇప్పటికి పూర్తి కాలేదంటూ ఆయన పెద్ద చిట్టానే విప్పి చెబుతున్నారు.
అదికారంలోకి రాగానే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకొస్తానని.. ప్రజల ఖాతాలో వేస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తాజాగా పనామా పత్రాల్లో వెల్లడైన పేర్లకు సంబంధించి విచారణకు ఎందుకు ఆదేశించలేదో చెప్పాలంటూ నిలదీశారు. ఛత్తీస్ గఢ్ సీఎం కుమారుడు అభిషేక్ సింగ్ పేరు పనామా పత్రాల్లో ఉందని.. దానిపై ప్రధాని ఎందుకు విచారణకు ఆదేశించలేదో చెప్పాలంటున్నారు.
బ్యాంకులకు భారీగా అప్పులు పడిన విజయ్ మాల్యా దేశాన్ని విడిచి వెళ్లే ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారని.. బాగా డబ్బు దోచుకున్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీని దేశం వెలువలే ఉంచారని.. ఈ విషయాలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ రాహుల్ వేస్తున్న ప్రశ్నలు పెరగటమే కాదు.. వాటి పదును పెరుగుతుందన్న విషయాన్ని కమలనాథులు గుర్తిస్తే మంచిది.