Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ల కొరత అంటుంటే.. ఎగుమతి అవసరమా!
By: Tupaki Desk | 9 April 2021 2:00 PM ISTదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఊహించని రీతిలో వేగంగా విస్తరిస్తుంది. దేశంలో గత కొన్ని రోజులుగా సరాసరిగా రోజుకి దాదాపు లక్ష వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో దేశంలోని ప్రతి ఒక్కరికి ఆందోళన మొదలైంది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. అయినా కూడా ఇంకా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు చాలామంది ఉన్నారు. అయితే , దేశంలో తయారైయ్యే కరోనా టీకా విదేశాలకి కూడా ఎగుమతి అవుతుంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న వేళ దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్ టీకాలను ఎగుమతి చేయడం ఎంతవరకు సమంజసం అని రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఓ వైపు వ్యాక్సిన్ల కొరత ఉందని రాష్ట్రాలు చెబుతుంటే ప్రధాని మోదీ మాత్రం టీకా ఉత్సవం జరపాలంటున్నారని ధ్వజమెత్తారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల కొరత అనేది చాలా తీవ్రమైన సమస్య. అంతేగానీ ఉత్సవం కాదు. దేశ ప్రజలను ప్రమాదంలో ఉంచి టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సరైందేనా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపించకుండా అన్ని రాష్ట్రాలకు సత్వర సాయం అందించాలి. ఈ మహమ్మారిపై మనమంతా కలిసికట్టుగా పోరాడి కరోనాను ఓడించాలి అని రాహుల్ ట్విటర్ లో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే అదేమీ లేదని, కొందరు కావాలనే టీకాలపై రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దుయ్యబట్టింది. మరోవైపు కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఈ నెల 11-14 తేదీల మధ్య వ్యాక్సిన్ ఉత్సవం నిర్వహించి, అర్హులైన వారందరికీ టీకాలు అందించాలని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.