Begin typing your search above and press return to search.

దేవుడు.. ప్రజల్నే తప్పు పడతారు.. తమ తప్పుల్ని మోడీ సర్కారు చెప్పదట

By:  Tupaki Desk   |   22 Sept 2020 2:40 PM IST
దేవుడు.. ప్రజల్నే తప్పు పడతారు.. తమ తప్పుల్ని మోడీ సర్కారు చెప్పదట
X
తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అని వేమన మహర్షి చెప్పారు. వేమన ప్రతిపద్యమూ నేటి వాస్తవ ప్రపంచంలో కనిపిస్తూనే ఉంది. సరే రాహుల్ గాంధీకి ఆ పద్యం తెలియకపోవచ్చు, చదివిండకపోవచ్చు గాని... దాదాపు సేమ్ టు సేమ్ ఆ పద్యమే గుర్తువచ్చేలా మోడీ సర్కారుని విమర్శించారు. ట్విట్టర్ ను వేదికగా చేసుకొని.. ఇటీవల కాలంలో ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాల పదును అంతకంతకూ పెరుగుతోంది. మీ తప్పులు తెలుసుకోరా? అంటూ నిలదీశారు

తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ లోక్ సభలో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ అంతకంతకూ విస్తరిస్తూ.. భారీగా కొత్త కేసుల నమోదులో అసలు తప్పంతా ప్రజలు.. దేవుడిదే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేయకపోవడం ఒకటైతే... ఇంకోకారణాన్ని వెతకడం ప్రభుత్వ వైఫల్యం.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన రాహుల్.. కేంద్రమంత్రి తీరును తీవ్రంగా తప్పు డుతున్నారు. దేశంలోని దుస్థితికి కొన్నిసార్లు దేవుడి మీదా నిందలు వేస్తారు. మరికొన్నిసార్లు ప్రజలపై తప్పు మోపుతారని.. కానీ తప్పుడు విధానాలు.. నిర్ణయాలను మాత్రం గుర్తించరని విరుచుకుపడ్డారు. ట్వీట్ పంచ్ వేసిన ఆయన.. తన వాదనకు కేంద్రమంత్రి వ్యాఖ్యల క్లిప్పింగ్ ను జత చేశారు. ఇంకెన్ని తప్పుడు విధానాల్ని దేశం భరించాలో అన్న అర్థం వచ్చేలా ఫైర్ అయ్యారు. నిజమే.. తన తప్పుల్ని వినమ్రతతో అంగీకరించాల్సిన ప్రభుత్వాలు అందుకు ప్రజల్ని.. దేవుడ్ని దోషిగా నిలబెట్టటం ఏ మాత్రం సరికాదంటున్నారు. మరి.. మోడీ సర్కార్ తమ తప్పుల్ని గుర్తించే పరిస్థితుల్లో ఉందంటారా?